ఆదాయ పన్ను అధికారి ఇంటిపై సీబీఐ దాడులు | cbi raids in income tax officer house at kphb colony | Sakshi
Sakshi News home page

ఆదాయ పన్ను అధికారి ఇంటిపై సీబీఐ దాడులు

Published Thu, Dec 1 2016 8:24 PM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

ఆదాయ పన్ను అధికారి ఇంటిపై సీబీఐ దాడులు

ఆదాయ పన్ను అధికారి ఇంటిపై సీబీఐ దాడులు

హైదరాబాద్ : ఆదాయ పన్ను శాఖాధికారి ఇంటిపై సీబీఐ అధికారులు గురువారం మెరుపు దాడులకు దిగారు. నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఆదాయ పన్ను అధికారి బొడ్డు వెంకటేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు ఏకకాలంగా తనిఖీలు చేపట్టారు. ఆయనపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాలుగు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు.

వెంకటేశ్వరరావు కుమారుల పేరుతో ప్రొడక్షన్ హౌస్ను స్థాపించారు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహారించి భారీగా డబ్బులు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. సప్త వర్ణ క్రియేషన్స్ పేరుతో ఆయన కుమారుడిని హీరోగా చిత్రం నిర్శిస్తున్నట్లు సమాచారం. నగరంతో సహా 15 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల విలువ దాదాపు 40 కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement