తణుకు: ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (వెస్ట్ మీరట్)గా పనిచేసిన ఐఎఫ్‌ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాద్‌రావు వ్యవహారంలో సీబీఐ మరోసారి సోదాలు చేపట్టింది. ఈ వ్యవహారంలో వారం రోజులుగా తణుకు పరిసర ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన బినామీలు, ఆస్తులు విక్రయించిన వారిపై దృష్టి సారించి వారిని విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తణుకుకు చెందిన ఐఎఫ్‌ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాదరావు ఇంటిలో గతేడాది అక్టోబరులో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు ఆయనతోపాటు ఆయన భార్య ఆకుల కనకదుర్గపైనా కేసులు నమోదు చేశారు.
అనంతరం ఈ ఏడాది మార్చిలో తణుకుకు చెందిన పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు బినామీలు, ఆస్తులు విక్రయించిన వారికి నోటీసులు జారీ చేసి వారినీ విశాఖలోని సీబీఐ కార్యాలయంలో విచారించారు. చాలాకాలం తర్వాత మరోసారి సీబీఐ అధికారులు ఇటుగా దృష్టి సా రించారు. తాజాగా రాంప్రసాదరావు నివాసముంటున్న రెండు ఇళ్లతోపాటు బినామీలుగా వ్యవహరించిన పలువురి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమాస్తుల వ్యవహారంలో ఆస్తులు విక్రయించిన వారితోపాటు సాక్షులుగా వ్యవహరించిన, బినామీలుగా ఉన్న వ్య క్తులకు సైతం ఇటీవల నోటీసులు జారీ చేసిన అధికారులు మరోసారి తనిఖీలు చేపట్టారు. వారం రోజులుగా చేస్తున్న సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
గతేడాది కేసు నమోదు
కేంద్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్, ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఎ ఫ్‌ఎస్ అధికారిగా ముత్యాల రాంప్రసాదరావు పనిచేస్తున్న సమయంలోనే సీబీఐ అధికారులు తణుకులోని ఆయన నివా సంపై దాడి చేసి గతేడాది అక్టోబర్ 11న కేసు నమోదు చేశారు. ఆయన గతంలో ఎన్టీపీసీలో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తణుకు, విశాఖ, న్యూఢిల్లీ, మీరట్‌లో ఏ కకాలంలో దాడులు చేశారు. సుమారు రూ.10.72 కోట్ల విలువైన చర, స్థిరాస్తి డాక్యుమెంట్లతోపాటు రూ. 37.25 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలను అప్పట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వీటి మార్కెట్ విలువ సుమారు రూ.150 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. రాంప్రసాదరావు భార్య ఆకుల కనకదుర్గ తణుకు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన సమాచారంతో రాంప్రసాదరావు, కనకదుర్గపై అధికారులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ప్రధాని పేషీకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దాడులు చేశారు. కనకదుర్గ భారీస్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమెకు బినామీలుగా ఉన్న రియల్‌ఎస్టేట్ వ్యాపారులపైనా దృష్టి సారిం చిన అధికారులు మరోసారి సోదాలు ని ర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మా రింది. అధికారులు రాజమండ్రి సీబీఐ కార్యాలయంలో వీరిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తణుకు రాష్ట్రపతి రోడ్డులో రాంప్రసాదరావు నివాసముంటున్న అ పార్ట్‌మెంట్‌లోని అన్ని ఫ్లాట్లలో సోదాలు జరిపినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment