
భోపాల్ : ఆయన ఓ ప్రభుత్వ శాఖలో గుమస్తాయే కానీ ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో భయటపడుతున్న డబ్బు, నగలు విస్మయానికి గురిచేస్తున్నాయి. మధ్యప్రదేశ్ భోపాల్ లో సీబీఐ అధికారులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి చెందిన అధికారుల నివాసాల్లో ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.3 కోట్లకు పైగా నగదుతో పాటు కరెన్సీ కౌంటింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు.
గురుగ్రామ్ కు చెందిన కెప్టెన్ కపూర్ అండ్ సన్స్ అనే సెక్యూరిటీ సంస్థ ఈఏడాది జనవరి నెలలో నెలకు రూ.11.30 లక్షలకు ఎఫ్‌సీఐకు సెక్యూరిటీ గార్డ్ లను అందించేందుకు టెండర్ వేసింది. ఆ టెండర్ కు సంబంధించి నిధులు చెల్లించే విషయంలో తమకు 10శాతం కమిషన్ ఇవ్వాలని ఎఫ్సీఐ అకౌంట్స్ మేనేజర్ సంబంధింత సెక్యూరిటీ సంస్థను డిమాండ్ చేశాడు.
దీంతో కెప్టెన్ కపూర్ అండ్ సన్స్ సెక్యూరిటీ యాజమాన్యం ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ఎఫ్‌సీఐ డివిజనల్ మేనేజర్ హరీష్ హినోనియా, మేనేజర్ అరుణ్ శ్రీవాస్తవ,గుమస్తాలు కిషోర్ మీనా,మోహన్ పరాటే ఇళ్లలో దాడులు జరిపారు.ఈ దాడుల్లో గుమస్తా కిషోర్ మీనా ఇంట్లో భయటపడ్డ నగదు, బంగారంతో అధికారులు షాక్ తిన్నారు. చెక్క పెట్టల్లో భద్రపరిచిన 8 కిలోల బంగారం, రూ. 2.17 కోట్ల నగదను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు నిందితుడి ఇంట్లో తనిఖీలు నిర్వహించే కొద్ది భారీ ఎత్తున నగదు వెలుగులోకి వస్తుండడంతో అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో గుమస్తా కిషోర్ మీనా ఆస్తుల వ్యవహారంలో అధికారుల హస్తం ఉందా అన్న కోణంలో సీబీఐ అధికారులు విచారణకు సిద్ధమయ్యారు.
చదవండి : Viral : మీ ఛాయ్ సల్లంగుండా.. యుద్ధం వచ్చినా మీరు టీ తాగడం ఆపరా
Comments
Please login to add a commentAdd a comment