కొట్లాడటం ఆ సీఎంకు ఫ్యాషనైపోయింది | it has become a fashion to delhi cm to criticise modi for everything, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

కొట్లాడటం ఆ సీఎంకు ఫ్యాషనైపోయింది

Published Tue, Dec 15 2015 10:54 AM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

కొట్లాడటం ఆ సీఎంకు ఫ్యాషనైపోయింది

కొట్లాడటం ఆ సీఎంకు ఫ్యాషనైపోయింది

పదే పదే కేంద్రప్రభుత్వంతో కొట్లాడటం, ప్రతి విషయానికీ ప్రధానమంత్రి పేరు ప్రస్తావించడం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఫ్యాషనైపోయిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ఢిల్లీ సచివాలయంలో ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్ కార్యాలయంలో సీబీఐ సోదాలు జరగడం.. దానిపై ప్రధానిని విమర్శిస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేయడంతో వెంకయ్యనాయుడు స్పందించారు. సీబీఐ ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో పనిచేయడంలేదని, అలా పనిచేసే రోజులు కాంగ్రెస్‌తోనే పోయాయని ఆయన అన్నారు. ఇప్పుడు సీబీఐ ఒక స్వతంత్ర సంస్థ అని, ప్రభుత్వం అందులో ఏమాత్రం జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. అసలు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని ఎలా విమర్శిస్తారని కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో ప్రధానికి ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు.

అధికారాన్ని దుర్వినియోగం చేశారు
ఢిల్లీ ముఖ్యమంత్రికి ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న రాజేంద్ర కుమార్ మీద తాము కేసు నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు వివరించాయి. గత కొన్నేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వ శాఖలకు చెందిన టెండర్లన్నింటినీ ఒకే సంస్థకు కేటాయించడం ద్వారా వాళ్లకు ప్రయోజనం చేకూరుస్తున్నారని, దీనిపై తాము వారంట్లు తీసుకుని ఆయన కార్యాలయం, ఇళ్లపై సోదాలు చేస్తున్నామని సీబీఐ తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement