మాస్కో: రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఎంఐ-8 హెలికాప్టర్ గురువారం తెల్లవారుజామున కూలిపోయింది. ఇందులో 13 మంది ప్రయాణీకులతోపాటు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. తొమ్మిది మందిని రక్షించినట్టుఅ ధికారులు ప్రకటించారు. గల్లంతైన వారి కోసం రక్షక దళాలు గాలిస్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు చెప్పారు.
తూర్పు ప్రాంతంలోని కమ్చట్కాలో ద్వీపకల్పంలోని కురిల్ సరస్సులో హెలికాప్టర్ కూలినట్లు అధికారులు వెల్లడించారు. ఇది సెయింట్ పీటర్స్‌బర్గ్ నుండి పర్యాటకులను తీసుకువెళుతోందని స్టేట్ న్యూస్ ఏజెన్సీ ఆర్‌ఐఏ నివేదించింది. ముగ్గురు సిబ్బందితోపాటు స్థానిక పర్యాటకులు ఇందులో ప్రయాణిస్తున్నారన్నారు. రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు కొనసాగుతోందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా కమ్చట్కా చాలా తక్కువ మంది జనాభా నివసించే పెద్ద భూభాగం. కానీ అగ్నిపర్వతాలు, రమణీయమైన ప్రకృతి దృశ్యాలతో నిండిన ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కడతారు.
Comments
Please login to add a commentAdd a comment