
సినీనటుడు జీవి సుధాకర్‌నాయుడు
కేపీహెచ్‌బీకాలనీ: ప్రముఖ సినీనటుడు జీవీ సుదాకర్‌నాయుడు కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. ఐ లవ్ కూకట్‌పల్లి పేరుతో ప్రచారం చేపట్టి నియోజకవర్గంలోని ప్రజలందరిని కలవనున్నట్లు తెలిపారు. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డుకాలనీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే పూర్తిస్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నట్లు ప్రకటించారు.
కులాలు, మతాల పేరుతో ప్రజలను ఓట్ల కోసం విభజించి పాలిస్తున్న పాలకులకు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పాలన సాగిస్తున్న పార్టీలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయాయన్నారు. అంతకుముందు ధర్మారెడ్డికాలనీ ఫేజ్ 1లో వినాయక మండపం వద్ద స్థానిక కాలనీవాసులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.