'ఆకు రౌడీలకు నేనిచ్చే వార్నింగ్' | ramgopal varma comments on vijayawada tour | Sakshi
Sakshi News home page

'ఆకు రౌడీలకు నేనిచ్చే వార్నింగ్'

Published Tue, Feb 23 2016 1:42 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

'ఆకు రౌడీలకు నేనిచ్చే వార్నింగ్'

'ఆకు రౌడీలకు నేనిచ్చే వార్నింగ్'

రామ్గోపాల్ వర్మ మరోసారి తన ట్విట్టర్కు పని చెప్పాడు. కొద్ది రోజులుగా పెద్దగా వివాదాస్పద వ్యాఖ్యలేవీ చేయని వర్మ, తన సింగిల్ ఎక్స్ పోస్టర్స్ తోనే హడావిడి చేస్తూ వచ్చాడు. ఇప్పటికే విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో 'వంగవీటి' పేరుతో సినిమా తెరకెక్కిస్తానని ప్రకటించిన వర్మ, తనకు వస్తున్న బెందిరింపులపై స్పందించాడు.

'ఈ నెల 26న వంగవీటి సినిమాకు సంబందించిన రీసెర్చ్ కోసం విజయవాడ వెళ్తున్నా. విజయవాడ రావొద్దని వార్నింగ్ ఇస్తున్న వాళ్లకు నా కౌంటర్ వార్నింగ్, నేనెప్పుడొస్తా.. ఎక్కడుంటానో చెప్తా.. మీకు దమ్ముంటే ముంబైలో అడుగుపెట్టండి. నాకు వార్నింగ్ ఇస్తున్న రౌడీలమనుకునే ఆకు రౌడీలు బావిలో కప్పలు. ఆ రౌడీలమనుకునే రౌడీలకన్నా ఎక్కువగా నేను విజయవాడను గౌరవిస్తాను.

రౌడీగార్లూ.. నేను బందర్ రోడ్లోని ఫార్చూన్ హోటల్లో ఉంటా.. నాకు వార్నింగ్ ఇస్తున్న ఇవాల్టీ విజయవాడ రౌడీలు తెలుసుకోవాల్సింది, నేను ఆనాటి రౌడీలతో తిరిగిన అసలు సిసలైన నిజమైన రౌడీని. ఆనాటి గొప్ప రౌడీలతో తిరిగిన నాలాంటి రౌడీకి వార్నింగ్ ఇస్తున్న రౌడీలమనుకునే ఈనాటి ఆకు రౌడీలకు నేనిచ్చే వార్నింగ్'.

వంగవీటి సినిమా ఎనౌన్స్ చేసి విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపిన వర్మ ఇప్పుడు విజయవాడలో అడుగుపెట్టి ఇంకెన్నీ సంచలనాలు నమోదు చేస్తాడో. అసలు వర్మ విజయవాడ పర్యటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement