ఆయన పార్టీ పెడితే చేరుతా : రామ్ గోపాల్ వర్మ
విజయవాడ: తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ప్రశంసల జల్లు కురిపించాడు.
ముద్రగడను రియల్ మెగా పవర్ స్టార్ అని అభివర్ణించాడు. స్క్రీన్ మెగా పవర్ స్టార్స్ ఫేక్ స్టార్స్ మాత్రమే అని కామెంట్ చేశాడు. తాను రాజకీయాలు, ప్రజా సంక్షేమంపై నమ్మకం లేదని... ఒకవేళ ముద్రగడ పార్టీ పెడితే ఆ పార్టీలో చేరతానన్నాడు. తాను కాపు వర్గానికి చెందిన వాడిని కాదని... తన మిత్రులు ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని చెప్పుకొచ్చాడు.
వంగవీటి సినిమా తీయడానికి ఆ కథకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు వర్మ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో పర్యటిస్తున్నాడు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), ప్రముఖ న్యాయవాది కర్నాటి రామ్మోహన్ సహా పలువురిని కలుస్తానని చెప్పాడు. జూన్ మొదటి వారంలో సినిమా విడుదల చేస్తామంటున్నాడు. రాజకీయాల్లోకి వస్తానంటూ వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు వంగవీటి సినిమా ప్రమోషన్లో భాగంగానే చేసినట్లుగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Mudragadda Padmanabham is the real mega power star and the so called screen mega power stars are just ordinary fake actors
— Ram Gopal Varma (@RGVzoomin) February 26, 2016
Mudragadda Padmanabham is the real mega power star and the so called screen mega power stars are just ordinary fake actors— Ram Gopal Varma (@RGVzoomin) February 26, 2016