అతడు 'హ్యాపీ డేస్' వంశీనే! | Happy days Vamsee as Devineni Murali in Vangaveeti | Sakshi
Sakshi News home page

అతడు 'హ్యాపీ డేస్' వంశీనే!

Published Fri, Mar 25 2016 3:33 PM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

అతడు 'హ్యాపీ డేస్' వంశీనే!

అతడు 'హ్యాపీ డేస్' వంశీనే!

'హ్యాపీ డేస్' సినిమాలో గాళ్ ఫ్రెండ్ మాయలో పడి స్నేహితులకి హ్యాండ్ ఇచ్చే క్యారెక్టర్ గుర్తుంది కదా.. వంశీకృష్ణ చాగంటి పోషించాడు ఆ పాత్రని. ఆ తరువాత అతను ఒకటి, రెండు సినిమాల్లో కనిపించినా....ప్రేక్షకుల్ని మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ వంశీనే తనదైన స్టైల్లో మరోసారి తెరమీదకు తీసుకొస్తున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. రామూ తదుపరి చిత్రం 'వంగవీటి'లో దేవినేని మురళి పాత్రలో నటించనున్నాడు వంశీ. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను వర్మ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

స్వయంగా రామూ చెప్పే వరకు ఆ గెటప్లో కనబడుతున్నది 'హ్యాపీ డేస్' వంశీ అని ఎవరూ పోల్చుకోలేకపోయారు. ఆ లుక్ వంశీదే అని తెలిశాక రామూని పొగడటం మొదలుపెట్టారు అభిమానులు. ఫెన్టాస్టిక్.. మైండ్ బ్లోయింగ్.. అన్ బిలీవబుల్.. అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు. అయితే వర్మ మాత్రం ఆ గెటప్ క్రెడిట్ అంతా వంశీదేనంటున్నాడు. ఇంతకుముందు కూడా వీరప్పన్ పాత్రకు రంగస్థల నటుడు సందీప్ భరద్వాజ్ను ఎంచుకుని అభిమానులను మెప్పించాడు రామ్ గోపాల్ వర్మ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement