త్వరలో ‘దేవినేని’ మోషన్ పోస్టర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'దేవినేని'.. 'బెజవాడ సింహం' ఉపశీర్షిక. జి.ఎస్.ఆర్, రాము రాథోడ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో నందమూరి తారకరత్న టైటిల్ రోల్లో నటిస్తుండగా నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైనందున డీటీఎస్ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావ్ మాట్లాడుతూ.... ఈ చిత్రంలో నటించిన నటీనటులు అంతా చాలా బాగా నటించారన్నారు. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ ఆకట్టుకున్నారన్నారు. ఇక దేవినేని నెహ్రూ పాత్రలో నందమూరి తారకరత్న పరకాయ ప్రవేశం చేసినట్లు నటించాడని పేర్కొన్నాడు.
(చదవండి: అందుకే నటించేందుకు ఒప్పుకున్నా)
సురేష్ కొండేటి-వంగవీటి రంగగా మిమ్మల్ని అలరించనున్నాడని, అలాగే సురేంద్ర పాత్రలో ఏంఎన్ఆర్ చౌదరి నటిస్తున్నారని చెప్పారు. దేవినేని మురళిగా తేజా రాథోడ్, దేవినేని గాంధీగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మిగిలిన పలు పాత్రల్లో బాక్సాఫీస్ రమేష్, రామ్ మోహన్, అన్నపూర్ణమ్మ, ధృవతారలు నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైందని, నేడు డిటీఎస్ కార్యక్రమం జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ త్వరలో విడుదల కానుందని తెలిపారు. ఈ చిత్రంలో మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో 1983 లో విజయవాడ ఫస్ట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె ఎస్ వ్యాస్ గారి పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారని తెలిపారు.
అయితే దేవినేని సినిమా బెజవాడలో ఇద్దరు మహనాయకుల నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఆ నాయకుల మధ్య స్నేహం, వైరంలో పాటు కుటుంబ నేపథ్యంలో సాగే సెంటిమెంట్‌ను కూడా దర్శకుడు జోడించాడు. ఇక బెజవాడలోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు. చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. అలాగే 1983లో విజయవాడకు మొదటి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా వెళ్లిన కేఎస్ వ్యాస్ పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సాంకేతిక నిపుణులు: దర్శకత్వం: నర్రా శివ నాగు, నిర్మాతలు: జి.ఎస్.ఆర్, రాము రాథోడ్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: కోటి, కో.డైరెక్టర్: శివుడు వ్యవహరిస్తున్నారు.