- కాపు నేతల డిమాండ్
- కొత్తపేటలో థియేటర్ వద్ద ధర్నా
‘వంగవీటి’ సినిమాను నిషేధించాలి
Published Sun, Dec 25 2016 11:25 PM | Last Updated on Tue, Sep 3 2019 8:56 PM
కొత్తపేట :
కాపు కులస్తులను ప్రదానంగా దివంగత కాపు నాయకుడు వంగవీటి రాధా, మోహనరంగా సోదరులను రౌడీలుగా చిత్రీకరించిన వంగవీటి సినిమాను వెంటనే నిషేధించాలని రాష్ట్ర బీజేపీ కిసా¯ŒS మోర్చా కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, జిల్లా కాపు యువత సభ్యుడు పెదపూడి బాపిరాజు, మండల కాపు యువత నాయకులు డిమాండ్ చేశారు.
సినిమాకు వంగవీటి పేరు పెట్టి వంగవీటి వంశాన్ని రౌడీలుగా చిత్రీకరించి, వారి ప్రత్యర్థి వర్గాన్ని హీరోలుగా చూపించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కృష్ణా జిల్లా, విజయవాడలో గతంలో జరిగిన వాస్తవ సంఘటనలకు విరుద్ధంగా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఒక వర్గానికి కొమ్ముకాసి వారు చెప్పినట్టు సినిమా తీశారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో సెన్సార్ బోర్డును, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కాపు యువత సభ్యులు నాగిరెడ్డి మణికంఠ, బండారు నరేష్ తదితరులు నాయకత్వం వహించారు.
Advertisement
Advertisement