నార్పల: మండల కేంద్రం సమీపంలోని మడుగుపల్లి కనుమపై సోమవారం 'వంగవీటి' సినిమా షూటింగ్ సందడి నెలకొంది. సోమవారం మడుగుపల్లి కనుమలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అసిస్టెంట్ల పర్యవేక్షణలో షూటింగ్ సాగింది. అనంతరం గాలిమరల షెడ్‌్లలోను, క్యాంప్ ఆఫీసులో కొన్ని కీలకమైన సీన్స్‌ను చిత్రీకరించారు. షూటింగ్ చూడడానికి పుట్లూరు, నార్పల మండలాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.