
వంగవీటిలో శాంతి గురించి చెప్పాడా..?
కొంత కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలకు, సంచలనాలకు దూరంగా ఉన్న రామ్ గోపాల్ వర్మ మళ్లీ మొదలెట్టాడు. ముఖ్యంగా టాలీవుడ్ తన సినిమాలతో కన్నా ట్విట్టర్ కామెంట్లతోనే ఎక్కువగా వార్తల్లో కనిపించిన వర్మ, ముంబై వెళ్లిపోయాక, సోషల్ మీడియాలో జోరు తగ్గించాడు. కానీ గత కొద్ది రోజులుగా తిరిగి తన మార్క్ స్టేట్మెంట్ లతో అభిమానులను అలరిస్తున్నాడు.
తాజాగా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లను తెగ పొగిడేస్తూ వరుస ట్వీట్ లు చేసిన వర్మ, శనివారం తన సినిమా ప్రచారానికి తెర తీశాడు. ప్రకటించిన దగ్గర నుంచే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన వంగవీటి సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన వర్మ. ఆ ప్రకటనలో కూడా తన మార్క్ స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త పడ్డాడు.
విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన వర్మ.. ఇది శాంతియుత అందుకే ట్రైలర్ రిలీజ్ కు ఆ రోజును ఎంచుకున్నట్టుగా తెలిపాడు. రౌడీయిజం నేపథ్యంలో శాంతియుత చిత్రాన్ని ఎలా తీశాడో వర్మకే తెలియాలి.
Since its a peaceful film pic.twitter.com/I7kmrBCIMf
— Ram Gopal Varma (@RGVzoomin) 3 September 2016