
ఆ పాట, సన్నివేశాలను తొలగిస్తాం
⇒ వంగవీటి సినిమాపై హైకోర్టుకు నిర్మాత కిరణ్ హామీ
సాక్షి, హైదరాబాద్: రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న వంగవీటి సినిమా ట్రయిలర్, టీజర్‌లోని పాట, కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో వాటిని తొలగిస్తామని చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ హైకోర్టుకు నివేదించారు. అప్పటి వరకు ట్రయిలర్, టీజర్‌ల ప్రదర్శనను నిలిపివేస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చారు.
దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.