వంగవీటి సినిమా నిర్మాణంపై మొదటి నుంచి అభ్యంతరం తెలుపుతున్న వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారిలతో దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారం ఉదయం భేటీ అయ్యారు. సినిమా షూటింగ్ ప్రారంభమైన సమయంలో కూడా రత్నకుమారితో భేటీ అయ్యేందుకు వర్మ ప్రయత్నించినా.., రత్నకుమారి అందుకు అంగకీరించలేదు. ఇప్పుడు జరిగిన ఈ భేటీలో వర్మతో పాటు నిర్మాత దాసరి కిరణ్ కుమార్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు.