Ratnakumari
-
బాలిక హత్య.. బాబాయే హంతకుడు?
సాక్షి, భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో బాలిక హత్య కలకలం రేపింది. సొంత బాబాయే బాలికను హత్య చేసి ఉంటాడని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కుమార్తె కనబడటం లేదని పోలీసులను ఆశ్రయించి.. అల్లాడిపోతున్న తల్లిదండ్రులకు వారి ఇంటి వెనుక ఉన్న తుప్పల్లోనే శవమై కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. భీమవరానికి చెందిన ములుపు అంజి, దుర్గ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె రత్నకుమారి(14). పట్టణంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. కూలి పనులు చేసుకునే వారు తమ బిడ్డను చదివించుకుంటున్నారు. వీరి ఇంటివద్దనే బాలిక బాబాయి ములుపు మావుళ్లు నివసిస్తున్నాడు. కొన్ని రోజులుగా రత్నకుమారికి ఆరోగ్యం బాగోకపోవడంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటోంది. ఈ నెల 26న రత్నకుమారి తల్లిదండ్రులు యథావిధిగా పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చే సరికి కుమార్తె లేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీసినా ఆమె జాడ తెలియలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రితో పాటు మావుళ్లు కూడా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. దిశ పోలీసులకు తన ఫోన్ నుంచి ఫిర్యాదు కూడా చేశాడు. మావుళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా అతని భార్య కువైట్‌లో ఉంది. అతని ఇద్దరు పిల్లలు నరసాపురంలోని హాస్టల్లో ఉంటున్నారు. రెండు రోజులుగా అతని ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో కొంతమంది యువకులు ప్రత్యేక నిఘా వేశారు. మావుళ్లు వేరొకరి ఇంటి నుంచి పార తేవడంతో అనుమానం మరింత బలపడింది. మూడు రోజులుగా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో బాలిక తండ్రి అంజి మరికొంత మందితో కలసి గురువారం ఉదయం ఇంటి వెనుక తుప్పలు, జమ్ముతో ఉన్న ప్రాంతంలో వెతికేందుకు వెళుతుండగా.. అక్కడ ఉండదు.. అటు వెళ్లొద్దంటూ మావుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ వారు వెళ్లి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. బాలికను బాబాయే ఇంట్లో చంపేసి ఆ తర్వాత మృతదేహాన్ని తుప్పల్లో పడేసి ఉంటాడని భావిస్తున్నారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తేలాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని స్థానికులు భావిస్తున్నారు. కాగా, బాలిక మృతదేహం లభించిన ప్రాంతాన్ని ఎస్పీ రవిప్రకాష్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి సమగ్రంగా విచారించాలని ఆదేశించారు. అనుమానితుడు మావుళ్లును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. -
‘వంగవీటి’ సినిమాపై రాజీపడం
- వంగవీటి రాధాకృష్ణ స్పష్టీకరణ - రాధాకృష్ణ, రత్నకుమారితో రామ్‌గోపాల్‌వర్మ చర్చలు - దేవినేని నెహ్రూతోనూ వర్మ భేటీ విజయవాడ: ‘వంగవీటి’ సినిమాపై తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలకు కట్టుబడి ఉన్నామని, అందులో రాజీపడే ప్రసక్తి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వంగవీటి’ సినిమాపై రాధాకృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రరుుంచిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌గోపా ల్‌వర్మ, దాసరి కిరణ్‌కుమార్ శనివారం విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారితో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. వివాద పరిష్కారంపై దాదాపు గంట పాటు జరిపిన ఈ సంప్రదింపుల్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) కూడా పాల్గొన్నా రు. చర్చల సారాంశం మాత్రం స్పష్టం కాలేదు. అనంతరం వంగవీటి రాధాకృష్ణ, రామ్‌గోపాల్ వర్మ, ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. ‘వంగవీటి’ సినిమాపై తమ అభ్యంతరాలపై రాజీ పడేది లేదని వంగవీటి రాధాకృష్ణ చెప్పారు. కోర్టు నిర్ణయానికే కట్టుబడి ఉంటా.. వంగవీటి మోహన్‌రంగా కుటుంబసభ్యులతో తాము జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదని రామ్‌గోపాల్‌వర్మ తెలిపారు. సినిమా విషయంలో కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. రాధాకృష్ణ, రత్నకుమారితో చర్చల అనంతరం రామ్‌గోపాల్‌వర్మ విజయవాడ గుణదలలోని దేవినేని రాజశేఖర్ ( నెహ్రూ) నివాసానికి వెళ్లారు. వంగవీటి సినిమా ట్రైలర్‌ను ఆయనకు చూపించారు. అనంతరం నెహ్రూ మీడియాతో మాటాడుతూ ఆ సినిమాలో తనను విలన్‌గా చూపించినా వద్దనే హక్కు తనకు లేదన్నారు. -
నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చారు: వర్మ
తాను జీవితంలో ఇప్పటివరకు చాలా సీరియస్ వార్నింగులు చూశాను గానీ.. మొట్టమొదటిసారి నవ్వుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేవాళ్లను చూశానని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పారు. వంగవీటి సినిమా నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారిలను విజయవాడలో కలిసి వచ్చిన తర్వాత నేరుగా మీడియాతో అయితే మాట్లాడలేదుగానీ, ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిప్రాయాలు వెల్లడించారు. 'మీటింగ్ అంత ఆశాజనకంగా సాగలేదు. సినిమాకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. నేను మాత్రం వెనక్కి తగ్గను.. ఏం జరుగుతుందో చూడాలి. నేను సీరియస్ వార్నింగ్‌లు చాలా చూశాను. కానీ తొలిసారిగా నవ్వుతూనే వార్నింగ్ ఇవ్వటం చూశాను. డేంజరస్. అయినా వంగవీటి సినిమా విషయంలో నా ఆలోచనలపై వెనక్కి తగ్గను. ఏమవుతుందో చూడాలి. ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారు. కానీ రాధ రంగా మిత్రమండలి సభ్యులు చాలా మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్లను నేను ఆడియో ఫంక్షన్ కు ఆహ్వానించాను' అంటూ కామెంట్ చేశారు. సంతృప్తి చెందలేదు: రాధా సినిమా విషయంలో తమకు అభ్యంతరాలున్నాయని ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన వంగవీటి రాధాకృష్ణ మాత్రం ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఇచ్చిన వివరణతో సంతృఫ్తి చెందలేదు. 'మా అభ్యంతరాలను వర్మకు తెలియజేశాం.. అదే విషయాలపై కోర్టుకు వెళ్లాం, సినిమా అభ్యంతరకరంగా ఉంటే అంగీకరించం. ఇక ఆయన ఇష్టం' అన్నారు. ఎవరూ వెనక్కి తగ్గలేదు: కొడాలి నాని ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలు అంత సంతృప్తికరంగా సాగలేదని ఈ చర్చల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. 'వర్మ, రాధ ఎవరూ వెనక్కి తగ్గేవారు కాదు. కానీ అభ్యంతరకర సన్నివేశాల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది వర్మే' అని ఆయన అన్నారు. Just met Radha and his Mother ..Meeting did not go half well....Problems..I will not compromise..Have to see what happens — Ram Gopal Varma (@RGVzoomin) 3 December 2016 I saw many serious warnings .1st time I saw very smilingly serious warnings .Dangerous .But I will not compromise on my vision of Vangaveeti — Ram Gopal Varma (@RGVzoomin) 3 December 2016 Two important people are troubling..But many Radha Ranga Mitra Mandali people supporting us and I invited them to Vangaveeti audio event — Ram Gopal Varma (@RGVzoomin) 3 December 2016 -
వంగవీటి రాధను కలిసిన రాంగోపాల్ వర్మ
-
వంగవీటి రాధను కలిసిన రాంగోపాల్ వర్మ
వంగవీటి సినిమా నిర్మాణంపై మొదటి నుంచి అభ్యంతరం తెలుపుతున్న వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారిలతో దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారం ఉదయం భేటీ అయ్యారు. సినిమా షూటింగ్ ప్రారంభమైన సమయంలో కూడా రత్నకుమారితో భేటీ అయ్యేందుకు వర్మ ప్రయత్నించినా.., రత్నకుమారి అందుకు అంగకీరించలేదు. ఇప్పుడు జరిగిన ఈ భేటీలో వర్మతో పాటు నిర్మాత దాసరి కిరణ్ కుమార్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వారిని కలిసి, సినిమాలో ఉండే అంశాలను వివరించినట్లు తెలుస్తోంది. సినిమా రూపొందించడానికి ముందే వంగవీటి ప్రత్యర్థులైన దేవినేని కుటుంబ సభ్యులను కలిసిన వర్మ.. ఇప్పుడు దాదాపు సినిమా నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారిలను కలిశారు. సినిమాలో దివంగత రంగా, రాధాల పాత్రలను ఎలా చూపిస్తారన్న విషయమై వాళ్ల అనుమానాలను నివృత్తి చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ రాజకీయాల నేపథ్యంలో వంగవీటి సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ, ప్రస్తుతం సినీరంగంతో పాటు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారాడు. వర్మ వంగవీటి సినిమాను ప్రకటించిన దగ్గర నుంచే అనేక వివాదాలు సినిమాను చుట్టుముట్టాయి. ఈ గొడవల మధ్యే షూటింగ్ పూర్తి చేసిన వర్మ ప్రస్తుతం సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా వర్మ స్వయంగా పాడి రిలీజ్ చేసిన కమ్మ కాపు పాటతో వివాదం తారస్థాయికి చేరింది. ఈ పాట కుల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని, పాటతో పాటు సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి వంగవీటి అభిమానులు కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై స్పందించిన కోర్టు పాటతో పాటు అభ్యంతరకర సన్నివేశాలను తొలగించే వరకు సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వవద్దని ఆదేశించింది. దీంతో దిగి వచ్చిన వంగవీటి చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఆ పాట, సన్నివేశాలను తొలగిస్తున్నట్టుగా ప్రకటించారు. -
వడ్డీ వ్యాపారి మోసం తో రోడ్డున పడ్డ బాధితురాలు
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి... వడ్డీ వ్యాపారి అవతారం ఎత్తి ఓ మహిళను మోసగించడంతో ఆమె రోడ్డున పడింది. బాధితురాలి కథనం మేరకు... గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం ఇసుకపల్లి ప్రాంతానికి చెందిన రత్నకుమారి (60) ఉపాధ్యాయుడైన బండారు రామకృష్ణ పరమహంస వద్ద రూ.80వేలు వడ్డీపై రుణం తీసుకుంది. ఆమె చెల్లించకపోవడంతో విషయం కోర్టుకు వెళ్లింది. కానీ, కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు జారీ కాకుండానే రామకృష్ణ అనుచరులు గురువారం రత్నకుమారి ఇంటికి వచ్చి లోపలున్న అన్ని వస్తువులను వాహనంలో తీసుకెళ్లిపోయారు. బాధితురాలు పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో వారు ఆ వస్తువులను స్టేషన్‌కు రప్పించారు. కాగా, తన ఇంట్లో ఉండాల్సిన సామాన్లు పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటంటూ బాధితురాలు రత్నకుమారి శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. తీసుకున్న అప్పుకు హామీ అంటూ సేల్ డీడ్ రాయించుకున్నారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కన్నీరు పెడుతూ మీడియాను కోరింది. -
హత్య చేసి.. ఆపై ఉరి వేసుకుని..
టేక్మాల్: మండలంలోని కాద్లూర్ గ్రా మంలో అనుమానాస్పదస్థితిలో ఓ ఇంట్లో ఇద్దరు మరణించిన కేసులో మిస్టరీ వీడింది. బీరప్ప అనే వ్యక్తి రత్నకుమారి గొంతు నులిమి చంపిన తరువాత భయంతో అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. వివరా లు ఇలా... కాద్లూర్ గ్రామానికి చెందిన పోతుల బొగుడ బీరప్ప(32) కొంతకాలంగా హైదరాబాద్‌లోనే ఉంటూ షాపూర్‌లోని ఓ కంపేనిలో పని చేస్తున్నాడు. రత్నకుమారి(38) బీరప్పతో పాటు అదే కంపెనీలో పని చేస్తుంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా పరిచయం ఏర్పడింది. స్వగ్రామమైన కాద్లూర్‌కు వెళ్లి సామగ్రి తీసుకొస్తానని బీరప్ప తన కుటుంబ సభ్యులకు చెప్పి ఈనెల 26న ఇంటినుంచి బయలు దేరాడు. డబ్బులు తీసుకువస్తానంటూ రత్నకుమారి వారింట్లో చెప్పి బయలుదేరింది. బీరప్ప, రత్నకుమారి ఇద్దరు కలిసి మంగళవారం కాద్లూర్‌కు వచ్చారు. కాద్లూర్లోని ఇంటికి చేరుకున్న వారిద్దరు బయటకు రాలేదు. శుక్రవారం ఇంటి నుంచి వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి పరి శీలించగా రెండు మృతదేహాలు వెలుగు చూశాయి. రత్నకుమారి మృతదేహం ఓ పక్కన పడి ఉండగా బీరప్ప శవం వేలాడుతూ కన్పించింది. అక్కడే ఉన్న బ్యాగ్ లో ఐడీ కార్డులతోపాటు రత్నకుమారి ఫొ టోలు, ఆమె కూతురైన సినీ ఆర్టిస్ట్ ఫొటోలతోపాటు రూ.19,540 నగదు దొరి కింది. డబ్బుల విషయమై గొడవ జరిగి ఉంటుందని... వచ్చిన రోజే బీరప్ప తన ఇంట్లో తలుపులు వేసి రత్నకుమారిని గొంతునులిమి చంపినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆ తరువాత భయానికిలోనైన బీరప్ప ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్ఐ తెలిపారు. రత్నకుమారిని గొంతునులిపి చంపినట్లు పోస్టుమార్టంలో తేలిందన్నారు. కన్నతల్లి ముఖం చూడని కూతురు.. రత్నకుమారి హత్యకు గురైన విషయం తెలుసుకున్న ఆమె కూతురైన సినీ ఆర్టిస్ట్ శుక్రవారం హైదరాబాద్ నుంచి వచ్చింది. అయితే కన్నతల్లిని కడసారి చూడడానికి ఇష్టపడలేదు. మృతదేహాన్ని సైతం తీసుకెళ్లకుండా స్థానికులకే డబ్బులిచ్చి అంత్యక్రియలు జరిపించింది. -
అమ్మకానికి ఆడబిడ్డలు
పిల్లలను విక్రయించే ముఠా గుట్టు రట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం మహిళను ప్రశ్నిస్తున్న ఐసీడీఎస్ అధికారులు దూలపల్లి: సూరారం కాలనీలో చంటి పిల్లలను విక్రయించే ముఠా గుట్టు రట్టయింది. ఓ బిడ్డను విక్రయించేందుకు యత్నిస్తుండగా ఐసీపీఎస్, ఐసీడీఎస్ అధికారులు వలపన్ని ముఠాను పట్టుకున్నారు. చంటిబిడ్డను శిశువిహార్‌కు తరలించారు. వివరాలివీ... తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన రత్నకుమారి, శర్మ దంపతులు రెండు నెలల క్రితం నగరానికి వ చ్చారు. సూరారం కాలనీలోని రాజిరెడ్డి నగర్‌లోగల అంగన్వాడీ-05 సెంటర్ వద్ద అద్దె ఇంట్లో ఉంటున్నారు. స్థానిక అంగన్వాడీ కార్యకర్తను రత్నకుమారి పరిచయం చేసుకుని తాను 8 నెలల గర్భిణినని, తన పేరు జాబితాలో రాసుకోవాలని పదే పదే కోరింది. డాక్టర్ పరీక్ష చేసిన తరువాతనే నమోదు చేస్తామని అంగన్వాడీ కార్యకర్త ఆమెకు తేల్చి చెప్పింది. మరో వారం తరువాత రత్నకుమారి 45 రోజుల చంటిబిడ్డతో కనిపించింది. అంగన్వాడీ కార్యకర్త ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పింది. ఈ విషయాన్ని ఐసీడీఎస్ అధికారి జ్యోతి పద్మ దృష్టికి ఆమె తీసుకెళ్లింది. దీంతో ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులు రత్నకుమారిని రెండు రోజుల క్రితం నిలదీయగా..సరైన సమాధానం రాలేదు. దీంతో వారు పాపను స్వాధీనం చేసుకొని, శిశు విహార్‌కు తరలించారు. మరో సంఘటన ఇలా.. ఆనంద్‌నగర్‌కు చెందిన అమీనాబేగం కూతురు ఆషాబేగంకు ఐడీపీఎల్‌కు చెందిన సలీంతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లుగా సలీం వేరే మహిళతో ఉంటున్నాడు. ఆషాబేగం ఒక్కతే ఉంటోంది. ఈనెల 8న ఆషాబేగంకు పాప పుట్టింది. గర్భవతులు, చిన్నారుల వివరాలు సేకరించే క్రమంలో ఓ అంగన్వాడీ కార్యకర్త.. ఆషాబేగం వద్ద చిన్నారి లేకపోవడం చూసి ప్రశ్నించింది. ఇక్కడా పొంతన లేని సమాధానం వచ్చింది. అనుమానం వచ్చిన కార్యకర్త తమ అధికారి అధికారి జ్యోతి పద్మ దృష్టికి తీసుకువెళ్లింది. ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులు విచారించగా... జగద్గిరిగుట్టలోని రాజీవ్ గృహకల్పకు చెందిన తపస్వి, విష్ణు సర్కార్లకు పాపను రూ.25 వేలకు విక్రయించినట్టు ఆషా చెప్పింది. దీంతో పాపను కొనుగోలు చేసిన వారిని రప్పించారు. వారు జీడిమెట్ల పీఎస్‌కు వచ్చి, పాపను తిరిగి ఇచ్చేది లేదని మొండికేశారు. ఈ ఘటనపై దుండిగల్ పీఎస్‌లో కేసు నమోదైంది. అక్కడే సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి పోలీసులు వారిని పంపించారు. అధికారుల దర్యాప్తులో సూరారం కాలనీలో ఉంటున్న రత్నకుమారి కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో ఆనంద్‌నగర్‌లోని ఆషా బేగం ఇంటికి వస్తున్నట్టు తేలింది. రెండు నెలలకోసారి ఇల్లు మార్చడం.. ఇప్పటికే ఓ చంటిబిడ్డతో పట్టుబడినే నేపథ్యంలో ఐసీడీఎస్ అధికారులు ఆమెపై అనుమానంతో కూపీ లాగుతున్నారు.