‘వంగవీటి’ సినిమాపై రాజీపడం
- వంగవీటి రాధాకృష్ణ స్పష్టీకరణ
- రాధాకృష్ణ, రత్నకుమారితో రామ్‌గోపాల్‌వర్మ చర్చలు
- దేవినేని నెహ్రూతోనూ వర్మ భేటీ
విజయవాడ: ‘వంగవీటి’ సినిమాపై తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలకు కట్టుబడి ఉన్నామని, అందులో రాజీపడే ప్రసక్తి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వంగవీటి’ సినిమాపై రాధాకృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రరుుంచిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌గోపా ల్‌వర్మ, దాసరి కిరణ్‌కుమార్ శనివారం విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారితో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. వివాద పరిష్కారంపై దాదాపు గంట పాటు జరిపిన ఈ సంప్రదింపుల్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) కూడా పాల్గొన్నా రు. చర్చల సారాంశం మాత్రం స్పష్టం కాలేదు. అనంతరం వంగవీటి రాధాకృష్ణ, రామ్‌గోపాల్ వర్మ, ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. ‘వంగవీటి’ సినిమాపై తమ అభ్యంతరాలపై రాజీ పడేది లేదని వంగవీటి రాధాకృష్ణ చెప్పారు.
కోర్టు నిర్ణయానికే కట్టుబడి ఉంటా..
వంగవీటి మోహన్‌రంగా కుటుంబసభ్యులతో తాము జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదని రామ్‌గోపాల్‌వర్మ తెలిపారు. సినిమా విషయంలో కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. రాధాకృష్ణ, రత్నకుమారితో చర్చల అనంతరం రామ్‌గోపాల్‌వర్మ విజయవాడ గుణదలలోని దేవినేని రాజశేఖర్ ( నెహ్రూ) నివాసానికి వెళ్లారు. వంగవీటి సినిమా ట్రైలర్‌ను ఆయనకు చూపించారు. అనంతరం నెహ్రూ మీడియాతో మాటాడుతూ ఆ సినిమాలో తనను విలన్‌గా చూపించినా వద్దనే హక్కు తనకు లేదన్నారు.