వడ్డీ వ్యాపారి మోసం తో రోడ్డున పడ్డ బాధితురాలు | The victim fell on the road with the lender fraud | Sakshi
Sakshi News home page

వడ్డీ వ్యాపారి మోసం తో రోడ్డున పడ్డ బాధితురాలు

Published Fri, Mar 18 2016 3:09 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

The victim fell on the road with the lender fraud

ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి... వడ్డీ వ్యాపారి అవతారం ఎత్తి ఓ మహిళను మోసగించడంతో ఆమె రోడ్డున పడింది. బాధితురాలి కథనం మేరకు... గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం ఇసుకపల్లి ప్రాంతానికి చెందిన రత్నకుమారి (60) ఉపాధ్యాయుడైన బండారు రామకృష్ణ పరమహంస వద్ద రూ.80వేలు వడ్డీపై రుణం తీసుకుంది. ఆమె చెల్లించకపోవడంతో విషయం కోర్టుకు వెళ్లింది. కానీ, కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు జారీ కాకుండానే రామకృష్ణ అనుచరులు గురువారం రత్నకుమారి ఇంటికి వచ్చి లోపలున్న అన్ని వస్తువులను వాహనంలో తీసుకెళ్లిపోయారు.


బాధితురాలు పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో వారు ఆ వస్తువులను స్టేషన్‌కు రప్పించారు. కాగా, తన ఇంట్లో ఉండాల్సిన సామాన్లు పోలీస్ స్టేషన్‌లో ఉండడం ఏంటంటూ బాధితురాలు రత్నకుమారి శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. తీసుకున్న అప్పుకు హామీ అంటూ సేల్ డీడ్ రాయించుకున్నారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కన్నీరు పెడుతూ మీడియాను కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement