lender
-
భర్త లోన్ చెల్లించలేదని.. భార్యపై వడ్డీ వ్యాపారి దారుణం..
పుణె: మహారాష్ట్రలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి లోన్ చెల్లించలేదని అతని భార్యను ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లు వెల్లడించారు. నిందితున్ని అరెస్టు చేసినట్లు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు వడ్డీ వ్యాపారి వద్ద కొంత మొత్తంలో డబ్బును లోన్ రూపంలో తీసుకున్నాడు. కానీ సకాలంలో లోన్ చెల్లించలేకపోయాడు. దీంతో వడ్డీ వ్యాపారి దారుణంగా ప్రవర్తించారు. బాధితున్ని కత్తితో బెదిరించి.. అతని భార్యను అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలను ఫోన్లో రికార్డ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘోరం బాధితుని కళ్లముందే జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితున్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్‌తో సహా.. సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కిందకు వస్తుందా..? కేంద్రం ఏం చెప్పింది..? -
InternationalWomen's Day 2023: మహిళల నిజాయితీపై సంచలన రిపోర్ట్
సాక్షి,ముంబై: రుణాలు చెల్లింపులో మహిళలే ముందు ఉన్నారని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. రుణాలను తిరిగి చెల్లించడంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ నిజాయితీగా ఉన్నారని క్రెడిట్ డేటా సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజా నివేదిక వెల్లడించింది. స్త్రీలకు రుణాలు ఇవ్వడం పురుషుల కంటే తక్కువ ప్రమాదకరమని ఈ డేటా వెల్లడించింది. అందుకే గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య బాగా పెరిగిందని వ్యాఖ్యానించింది. ప్రతి ఏటా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన నివేదికను ప్రకటిస్తుంది తన రుణ చెల్లింపుపై ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల నుండి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో భారతదేశంలోని స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ మనస్సాక్షిగా ఉంటారని వెల్లడించింది. గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య పెరగడానికి వారి మరింత నిజాయితీగా తిరిగి చెల్లించే ప్రవర్తనే కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో భారతదేశంలో మహిళా రుణగ్రహీతల సంఖ్య వార్షిక రేటు 15 శాతం పెరిగింది, పురుషులతో పోలిస్తే ఇది 11 శాతం. 2017లో 25 శాతం మంది మహిళలు రుణాలు తీసుకోగా, 2022లో ఈ సంఖ్య 28 శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది ఈ గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం, దేశీయ అంచనా జనాభా 1.4 బిలియన్లలో దాదాపు 454 మిలియన్ల వయోజన మహిళలు ఉన్నారు. వీరిలో 2022 వరకు దాదాపు 6.3 కోట్ల మంది మహిళలు రుణాలు తీసుకున్నారు. మహిళలకు రుణ సదుపాయం 2017లో 7 శాతంగా ఉంది, ఇది 2022లో 14 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు సాధించిన పురోగతి ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ఇంకా మెరుగు పడాల్సి ఉందనికూడా తెలిపింది. మహిళా రుణగ్రహీతల సంఖ్య పెరగడం ప్రభుత్వ ఆర్థిక సమ్మేళనానికి సానుకూల సంకేతమని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సీవోవో హర్షలా చందోర్కర్ అభిప్రాయపడ్డారు. వివిధ సామాజిక-ఆర్థిక వర్గాలు, ఏజ్ గ్రూపులు,, భౌగోళిక ప్రాంతాలలో మహిళలకు అనుగుణంగా రుణాలను అందించడం వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి సహాయపడుతుందని కూడా ఆమె సూచిస్తున్నారు. దీని వల్ల మహిళలకే కాకుండా సంప్రదాయంగా వెనుకబడిన రంగాలకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. -
రుణాలు : తీసుకున్నది తిరిగి ఇచ్చేయండి, లేదంటే లావైపోతారు.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణాలు తీసుకోవడంలోనే కాదు ఇవ్వడంలోనూ యూత్ సత్తా చాటుతున్నారు. ఆన్లైన్ వేదికగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీర్ టు పీర్) మధ్య జరిగిన రుణ లావాదేవీలపై లెన్‌డెన్‌క్లబ్ విడుదల చేసిన 2020-21 అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 12 లక్షల మంది సర్వేలో పాలుపంచుకున్నారు. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతలో.. రుణాలు తీసుకున్నవారు 56 శాతం ఉంటే.. రుణాలు ఇచ్చినవారు 54 శాతం మంది ఉండడం విశేషం. లోన్స్ కోసం దరఖాస్తులన్నీ దాదాపు యాప్ ద్వారానే జరుగుతున్నాయి. అత్యవసర వైద్యానికి ఎక్కువగా అప్పులు చేశారు. అదికూడా రూ.25,000 వరకే. హైదరాబాదీయులు రుణాలు తీసుకోవడంలో మూడవ స్థానంలో, ఇవ్వడంలో రెండవ స్థానంలో నిలిచారు. విశేషమేమంటే రుణాలు ఇచ్చినవారిలో 19 శాతం మంది మహిళలు ఉన్నారు. -
తీర్చే మార్గం
పూర్వం బనీ ఇస్రాయీల్ జాతికి చెందిన ఒక వ్యక్తికి వెయ్యి బంగారు నాణేలు అత్యవసరపడ్డాయి. దాంతో తనకు బాగా తెలిసిన ఒక వ్యాపారిని అప్పివ్వమని అభ్యర్థించాడు. ఆ వ్యాపారి అల్లాహ్ పై నమ్మకం ఉంచి అతనికి వెయ్యి బంగారు నాణాలను అప్పుగా ఇచ్చాడు. ఫలానా గడువులోగా తిరిగి ఇచ్చేయాలని షరతు కూడా పెట్టాడు. బంగారు నాణేలను తీసుకుని సముద్ర మార్గాన్ని దాటి తన ప్రాంతానికి వెళ్లిపోయాడు. తీసుకున్న డబ్బుతో అవసరాలు తీర్చుకున్నాడు. అంతలోనే అప్పు తీర్చే గడువు రానేవచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు నాణాలను తీసుకుని అప్పు తీర్చే ఉద్దేశంతో ప్రయాణానికి సిద్ధమయ్యాడు. సముద్ర తీరం దగ్గర నిలబడి పడవ కోసం ఎదురుచూడసాగాడు. ఎంతసేపటికీ పడవ వచ్చే జాడకానరావడం లేదు. ఎలాగైనా ఈ బంగారు నాణేలను ఈరోజు అతనిదాకా చేర్చాలని గట్టి సంకల్పం చేసుకున్నాడు. ఇచ్చిన మాట తప్పుతున్నానని కుమిలిపోసాగాడు. సముద్రం ఒడ్డున పడి ఉన్న ఒక కర్రను అందుకున్నాడు. దాన్ని రెండుగా చీల్చి అందులో అప్పుగా తీసుకున్న వెయ్యి బంగారు నాణాలను నింపాడు. చీల్చిన కర్రను అతికించాడు. ‘‘ఓ అల్లాహ్ రుణాన్ని తీర్చే మార్గం కానరావడం లేదు. కాబట్టి ఈ నాణాలు నా రుణదాత వరకు చేర్చు ప్రభూ’’ అని వేడుకుంటూ నాణేల కర్రను సముద్రంలో వదిలాడు. అటువైపు ఆ రోజు తనవద్ద అప్పు తీసుకున్న వ్యక్తి కోసం వ్యాపారి సముద్రం ఒడ్డున ఎదురుచూడసాగాడు. ఎంతసేపటికీ ఎవ్వరూ వచ్చే జాడకానరాలేదు. అయితే అంతలోనే ఒక కర్ర సముద్రంలో కొట్టుకువచ్చింది. పొయ్యిలో కనీసం కట్టెగానైనా పనికొస్తుందనే ఉద్దేశంతో ఇంటికి తీసుకువచ్చాడు. కర్రను పొయ్యిలో పెట్టేందుకు కర్రను చీల్చి చూసినప్పుడు; అందులోంచి వెయ్యి బంగారు నాణాలు నేలపై రాలిపడ్డాయి. అందులో ఉన్న ఉత్తరాన్ని చదివాక అతనికి అసలు విషయం అర్థమయ్యింది. తర్వాత కొంతకాలానికి మళ్లీ ఆ వ్యక్తి అప్పు తీర్చే ఉద్దేశంతో వ్యాపారి ఇంటికి వెళ్లాడు. ‘‘దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆరోజు నీకిచ్చిన మాటప్రకారం అప్పు తీర్చే ఉద్దేశంతో సముద్ర తీరానికి చేరుకున్నాను. కానీ పడవలు అందుబాటులో లేకపోవడంతో నీదాకా రాలేకపోయాను. ఇప్పుడు నీ అప్పును నయా పైసాతో సహా చెల్లిస్తున్నాను. అందుకో’’ అంటూ బంగారు నాణేల సంచిని అందించబోయాడు. ‘‘నువ్వు ఆరోజు సముద్రంలో నాకోసం కర్రలో పెట్టి పంపిన నాణాలు నాదాకా చేరాయి. మళ్లీ ఎందుకు’’ అంటూ తిరిగి ఇచ్చేశాడు. ‘‘ఆరోజు నీకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వేరే మార్గంలేక సముద్రంలో కర్రలో పెట్టి వదిలాను. అవి నీకు ఇంకా చేరలేదేమోనని’’ ఆ వ్యక్తి చెప్పాడు. అప్పు తిరిగి ఇచ్చే ఉద్దేశంతో తీసుకుంటే రుణం తీర్చడంలో అల్లాహ్ తోడ్పడతాడన్నది ఈ గాథలో నీతి. రుణదాతలైనా, రుణ గ్రహీతలైనా మంచి మనస్సు కలిగి ఉండాలన్నదే ఇందులోని సందేశం. – ముహమ్మద్ ముజాహిద్ -
నిబంధనల ప్రకారమే సమాచారం వెల్లడించాం
న్యూఢిల్లీ: మొండిబాకీల లెక్కల్లో వ్యత్యాసాల్లేవన్న (డైవర్జెన్స్) ప్రకటనపై రిజర్వ్ బ్యాంక్ అక్షింతలు వేసిన నేపథ్యంలో యస్ బ్యాంక్ వివరణనిచ్చింది. నిబంధనల ప్రకారమే ‘నిల్ డైవర్జెన్స్’ గురించి వెల్లడించామని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఆర్బీఐ పంపిన రిస్కుల మదింపు నివేదిక (ఆర్ఏఆర్)లోని డైవర్జెన్స్ వివరాలు లీకవడం లేదా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నందున వార్షిక ఫలితాలను ప్రకటించే దాకా ఆగకుండా సత్వరం వెల్లడించినట్లు వివరించింది. ఎక్సే్చంజీలు, ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే ఎలాంటి చర్యలకూ పాల్పడలేదని స్పష్టం చేసింది. 2017–18లో మొండిబాకీలకు కేటాయింపుల విషయంలో ముందుగా భావించినట్లు వ్యత్యాసాలేమీ లేవని రిజర్వ్ బ్యాంక్ తేల్చిందంటూ యస్ బ్యాంక్ గత వారంలో ప్రకటించడం, దీంతో షేరు ఒక్కసారిగా ఎగియడం తెలిసిందే. విశ్వసనీయమైన నివేదికను బహిరంగపర్చినందుకు చర్యలు ఉంటాయంటూ ఆర్బీఐ హెచ్చరించడంతో బ్యాంక్ తాజా వివరణనిచ్చింది. -
జెట్ రుణ సంక్షోభానికి తెర!
ముంబై: నిధుల కటకట ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ కోసం రుణదాతలు సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళికకు కంపెనీ బోర్డు గురువారం ఆమోదముద్ర వేసింది. 2018 ఫిబ్రవరి 12 నాటి ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు ఈ రుణ పరిష్కార ప్రణాళికను రూపొందించినట్టు జెట్ ఎయిర్వేస్ తెలియజేసింది. తాజా ఈక్విటీ రూపంలో నిధులు అందించడం, ఇప్పటికే ఇచ్చిన రుణాలను పునరుద్ధరించడం, ఆస్తుల విక్రయం వంటివి ఈ ప్రణాళికలో భాగం. ఈ చర్యల అనంతరం బ్యాంకులో అతిపెద్ద వాటాదారులు రుణ దాతలే అవుతారు. రుణాలను ఈక్విటీ రూపంలోకి మార్చడం కింద... రూ.10 ముఖ విలువ కలిగిన 11.40 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయనుంది. కాకపోతే పుస్తక విలువ ప్రతికూలంగా ఉన్నందున ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం షేరు ముఖ విలువను రూ.1 కింద పరిగణనలోకి తీసుకుంటారు. జెట్ ఎయిర్వేస్ సుమారు రూ.8,500 కోట్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. ఇందులో వచ్చే మార్చి నాటికే తిరిగి చెల్లించాల్సిన మొత్తం రూ.1,700 కోట్లు. తన పనితీరు మెరుగుపరుచుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం, వ్యయాలను తగ్గించుకోవడం, నెట్వర్క్, సేవలకు సంబంధించిన వ్యాపార నమూనాలో మార్పుల వంటి చర్యలు కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఈ పరిష్కార ప్రణాళికకు ఈ నెల 21న జరిగే సమావేశంలో వాటాదారుల ఆమోదాన్ని కంపెనీ కోరనుంది. నష్టాలు రూ.732 కోట్లు జెట్ ఎయిర్వేస్కి ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.588 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.165 కోట్ల నికర లాభం వచ్చిందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ఇంధన వ్యయాలు అధికంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం వల్ల ఈ క్యూ3లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే, గత క్యూ3లో రూ.186 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.732 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,148 కోట్లు.... కంపెనీ ఆదాయం రూ.6,086 కోట్ల నుంచి రూ.6,148 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు సైతం రూ.6,043 కోట్ల నుంచి రూ.6,786 కోట్లకు పెరిగాయి. గత క్యూ3లో రూ.2,749 కోట్లుగా ఉన్న దేశీయ ఆదాయం ఈ క్యూ3లో రూ.2,560 కోట్లకు తగ్గిందని, అంతర్జాతీయ ఆదాయం కూడా రూ.3,337 కోట్ల నుంచి రూ.3,588 కోట్లకు తగ్గిందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యలో బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేర్ 1 శాతం లాభంతో రూ.225 వద్ద ముగిసింది. -
రుణాలకు ఆక్సీలోన్స్
• రుణదాత, గ్రహీత ఇద్దరినీ కలిపే వేదిక • ఆక్సీలోన్‌స ఫౌండర్, సీఈఓ రాధాకృష్ణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు రుణాల కోసం బ్యాంకులకో, ఆర్థిక సంస్థలకో, లేక వడ్డీ వ్యాపారుల వద్దకో పరుగెత్తాం. కానీ, ఇప్పుడా అవసరం లేదంటోంది ఆక్సీలోన్‌స. రుణదాతలు, గ్రహీతలు ఇద్దరినీ కలపడమే మా పనంటోంది కూడా. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఆక్సీలోన్‌స స్టార్టప్ సేవలు, విశేషాల గురించి సంస్థ ఫౌండర్, సీఈఓ రాధాకృష్ణ తాటవర్తి మాటల్లోనే.. ⇔ సాంకేతికత, విద్యా, వ్యాపార రుణాలు మాత్రమే కాకుండా గర్భవతి రుణాలు, గోల్ఫ్ మెంబర్షిప్ రుణాలు, ఇస్లామిక్ రుణాల వంటివి కూడా ఇప్పించడం మా ప్రత్యేకత. ప్రస్తుతం 20 రకాల రుణాలను ఇప్పిస్తున్నాం. గోల్ఫ్ కోర్ట్లతో, విద్యా సంస్థలతోనూ ఒప్పందం చేసుకున్నాం. ⇔ మొత్తం రుణ మంజూరులో గ్రహీత నుంచి 1.5 శాతం, దాత నుంచి 2.5 శాతం కమీషన్ రూపంలో తీసుకుంటాం. ప్రస్తుతం మన దేశంతో పాటు దుబాయ్, కతర్ వంటి జీసీసీ దేశాలు, యూకేల్లో సేవలందిస్తున్నాం. ⇔ సాంకేతికత అభివృద్ధి, ఉద్యోగుల నియామకం, ప్రచారం కోసం కోటి రూపాయలు ఖర్చరుుంది. వచ్చే నెలలో సీడ్ క్యాపిటల్ కింద రూ.3 కోట్ల ని దుల సమీకరణ చేయనున్నాం. వచ్చే ఏడాది ఆగ స్టు నాటికి రూ.20 మిలియన్ డాలర్ల వెంచర్ క్యాపటలిస్ట్ నిధులను కూడా పొందాలని లక్ష్యించాం. -
వడ్డీ వ్యాపారి మోసం తో రోడ్డున పడ్డ బాధితురాలు
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి... వడ్డీ వ్యాపారి అవతారం ఎత్తి ఓ మహిళను మోసగించడంతో ఆమె రోడ్డున పడింది. బాధితురాలి కథనం మేరకు... గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం ఇసుకపల్లి ప్రాంతానికి చెందిన రత్నకుమారి (60) ఉపాధ్యాయుడైన బండారు రామకృష్ణ పరమహంస వద్ద రూ.80వేలు వడ్డీపై రుణం తీసుకుంది. ఆమె చెల్లించకపోవడంతో విషయం కోర్టుకు వెళ్లింది. కానీ, కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు జారీ కాకుండానే రామకృష్ణ అనుచరులు గురువారం రత్నకుమారి ఇంటికి వచ్చి లోపలున్న అన్ని వస్తువులను వాహనంలో తీసుకెళ్లిపోయారు. బాధితురాలు పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో వారు ఆ వస్తువులను స్టేషన్‌కు రప్పించారు. కాగా, తన ఇంట్లో ఉండాల్సిన సామాన్లు పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటంటూ బాధితురాలు రత్నకుమారి శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. తీసుకున్న అప్పుకు హామీ అంటూ సేల్ డీడ్ రాయించుకున్నారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కన్నీరు పెడుతూ మీడియాను కోరింది.