మరో రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌లో... | another real life character ... | Sakshi
Sakshi News home page

మరో రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌లో...

Published Fri, Jul 21 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

మరో రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌లో...

మరో రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌లో...

‘వంగవీటి’ సినిమాలో వంగవీటి రంగా, వంగవీటి రాధా... రెండు పాత్రల్లో ఆకట్టుకున్న సాండీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘దళం’ ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్‌రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నాం. 1962 నుంచి 1972లలో విద్యార్థి రాజకీయాలు, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ఓయూ పరిణామాలు, జార్జ్‌ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉంటుంది.

ప్రీ–ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. భారీ బడ్జెట్‌తో తెలుగు సినిమాల్లోనే ఒక డిఫరెంట్‌ జానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో తెలుగు నటులతో పాటు హిందీ, తమిళ, మలయాళ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తారు. తెలుగు, హిందీ భాషల్లో రానున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను త్వరలో విడుదల చేస్తాం. మరాఠీ సినిమా ‘సైరాట్‌’ కెమెరామన్‌ సుధాకర్‌ ఎక్కంటి మా చిత్రానికి పని చేయనున్నారు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement