
వంగవీటి లోగో
నిజ జీవిత కథలు, వివాదాస్పద చరిత్రలను సినిమాలుగా తెరకెక్కించడానికి ఏమాత్రం వెనుకాడని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సారి విజయవాడ మీద పడిన సంగతి తెలిసిందే. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో సినిమా తీయనున్న రామూ ఇప్పటికే వంగవీటి పాత్రధారి ఫొటోలతో హల్ చల్ చేశాడు. తాజాగా వంగవీటి టైటిల్ లోగోను గురువారం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశాడు. ఎర్రటి జెండా, కత్తి, గొలుసులతో ఉన్న వంగవీటి సినిమా లోగో రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్ లా కనబడుతోంది.
ఏదేమైనా వంగవీటి సినిమా ఎనౌన్స్ చేసి విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాడు వర్మ. వంగవీటి కంటే అద్భుతమైన కథ తనకు దొరకదని... 'శివ'తో ప్రారంభమైన తన ప్రస్థానం 'వంగవీటి'తో ఆగిపోతుందని వర్మ ఇదివరకే ప్రకటించాడు.
Title logo of "Vangaveeti" pic.twitter.com/iJ2RTs8Slu
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2016