వంగవీటి రంగాను చంపించిన వ్యక్తి చంద్రబాబు: వంగవీటి నరేంద్ర | BJP Leader Vangaveeti Ranga Sensational Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

వంగవీటి రంగాను చంపించిన వ్యక్తి చంద్రబాబు: వంగవీటి నరేంద్ర

Published Sat, Nov 20 2021 8:56 PM | Last Updated on Sat, Nov 20 2021 9:03 PM

BJP Leader Vangaveeti Ranga Sensational Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు దొంగ ఏడ్పులతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడని బీజేపీ నేత వంగవీటి నరేంద్ర అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు కంటి వెంట ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యుల క్యారెక్టర్‌ను కించపరిచిన వ్యక్తి చంద్రబాబు. ముద్రగడ భార్యను పోలీసులతో పచ్చి బూతులు తిట్టించారు.

చిరంజీవి గురించి.. ఆయన కూతురు గురించి తప్పుడు ప్రచారం చేయించారు. పవన్ కల్యాణ్ తల్లి గురించి, భార్యల గురించి ఇష్టానుసారంగా తిట్టించిన వ్యక్తి. వంగవీటి రంగాను చంపించిన వ్యక్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భార్యను, తల్లిని శాసనసభలో తిట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ వంగవీటి నరేంద్ర తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు.

చదవండి: (విధి ఎవర్నీ వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుంది: ఆర్కే రోజా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement