సిటీవాసులను కాపాడిన తమిళ పోలీసులు | Hyderabadis Saved by Tamilnadu Police | Sakshi
Sakshi News home page

సిటీవాసులను కాపాడిన తమిళ పోలీసులు

Published Wed, Sep 20 2017 2:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Hyderabadis Saved by Tamilnadu Police

సాక్షి, చెన్నై : చెన్నైలోని మెరీనా బీచ్‌లో స్నానానికి దిగిన అన్నదమ్ములను రాక్షస అల నీటిలోకి లాక్కెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన రమణ (35), నరేంద్ర (28)లు చెన్నై మదురవాయల్‌ కృష్ణానగర్‌లోని తమ బంధువుల ఇంటికి ఇటీవల వచ్చారు. వీరిద్దరూ సోమవారం సాయంత్రం మెరీనా బీచ్‌కు వెళ్లారు. అక్కడ స్నానానికి దిగిన వీరిని రాక్షస అల నీటిలోకి లాక్కెళ్లడంతో స్థానికులు కేకలు వేశారు. అక్కడ గస్తీలో ఉన్న పోలీసులు రమణ, నరేంద్రలను రక్షించి ఒడ్డుకు చేర్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అన్నదమ్ములిద్దరినీ రక్షించిన పోలీసులను స్థానికులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement