ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌లైన్ : తమ వద్దకు వచ్చే ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నామని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజింగ్ డెరైక్టర్, చైర్మన్ నరేంద్ర అన్నారు. హన్మకొండ రాంనగర్‌లోని ఏబీకే మాల్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ వరంగల్ రీజియన్ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ నరేంద్ర విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది వరంగల్ రీజియన్ పరిధిలో *2000 వేల కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు నిర్వహించామని, వచ్చే ఏడాదిలో ఈ సంఖ్యను *5,000 వేల కోట్లకు పెంచేందుకు ప్రణాళికలు రూపొం దించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,059 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయని తెలిపారు. గతంలో తమ బ్యాంకు సేవలు ఎక్కువగా పట్టణాలు, నగరాల్లో అందుబాటులో ఉండేవని, కొత్తగా ఈ ఏడాది 156 బ్రాంచ్‌లు ప్రారంభించగా వీటిలో 60 శాఖలను గ్రామీణ ప్రాంతాల్లోనే నెలకొల్పినట్లు వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా మరో 26 శాఖలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా త మ బ్యాంకు సేవలను విస్తరిస్తున్నామని, ఇందు లో భాగంగా వ్యవసాయం, సూక్ష్మ, చిన్న తర హా యూనిట్లకు రుణాలను విరివిగా అందజేస్తున్నామని చెప్పారు. ఐఓబీ తరపున ఇప్పటికే అగ్రిమేళా కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు పంటలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. రైతులకు వ్యవసాయరుణాలు ఇచ్చేందుకు దేశ వ్యాప్తం గా తమకు 40 బ్యాంకులు ఉన్నాయన్నారు. కొలంబో, హంగ్‌కాంగ్, సియోల్, సింగపూర్‌లో కూడా తమ బ్రాంచ్‌లను నెలకొల్పి విదేశాల్లో తమ సేవలను విస్తరింపజేశామన్నారు.
రాబోయే మూడునెలల్లో బ్యాంకు బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఖాతాదారులను ఆకట్టుకునేందుకు గిఫ్ట్‌కార్డు, లిటిల్‌స్టార్ అకౌం ట్ వంటి పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వరంగల్‌లో రీజినల్ సెంటర్‌ను ప్రారంభించడం ద్వారా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో తమ సేవలు మరింత విస్తరింపజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, రీజినల్ సెంటర్ ప్రారంభాన్ని పురస్కరించుకుని 20 మంది లబ్ధిదారులకు సీఎండీ *20 కోట్ల రుణాలను చెక్‌ల ద్వారా పంపిణీ చేశారు. కార్యక్రమంలో బ్యాంకు సీనియర్ రీజినల్ మేనేజర్ కె.జీవానందం, చీఫ్ మేనేజర్ ఎం.రాజేశ్వరి, ఐఓబీ నేషనల్ బ్యాంకింగ్ జనరల్ మేనేజర్ పవన్‌కుమార్‌గార్గ్, హైదరాబాద్ చీఫ్ రీజినల్ మేనేజర్ కె.స్వామినాథన్, బ్రాంచ్ మేనేజర్లు రామకృష్ణపట్నాయక్, ఆంజనేయరెడ్డి, నాగప్రసాద్, వీరన్న, రంజిత్, ఐఓబీ ఆఫీసర్స్ అసోషియేషన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ సుబ్బారావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అంచిరెడ్డి, అవార్డ్స్ స్టాఫ్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, ఎస్‌ఆర్ విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్‌మోహన్‌రావు, టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.రాజేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రత్నవీరాచారి, నాయకుడు రత్నాకర్‌రెడ్డి, బిల్డర్స్ అసోషియేషన్ నాయకుడు చిదురాల రఘునాథ్, ఫోరం బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ పాల్గొన్నారు.
ఖాతాదారులకు మెరుగైన సేవలు
Published Fri, Dec 13 2013 3:29 AM | Last Updated on Wed, Apr 3 2019 8:09 PM
Advertisement