నరేంద్రకు రాష్ట్రపతి ప్రశంస | President admiration to narendra | Sakshi
Sakshi News home page

నరేంద్రకు రాష్ట్రపతి ప్రశంస

Published Sat, Mar 4 2017 9:33 PM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM

నరేంద్రకు రాష్ట్రపతి ప్రశంస

నరేంద్రకు రాష్ట్రపతి ప్రశంస

బండిఆత్మకూరు: ఆటోమేటిక్‌ హెల్మెట్‌ను తయారు చేసిన సంతజూటూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి నరేంద్రను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంశించినట్లు ఉపాధ్యాయుడు రవిశంకర్‌ తెలిపారు. శనివారం ఆయన న్యూఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడారు. ఈనెల 4 నుంచి 10వ తేదీ దాకా నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ కార్యక్రమం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహిస్తున్నారన్నారు. మొదటి రెండు రోజులు దేశంలో ఎంపికైన ఇన్‌స్పైర్‌ అవార్డుల్లో విద్యార్థులు తయారు చేసిన 60 ప్రాజెక్టులను ప్రదర్శిస్తారన్నారు. ఇందులో తమ విద్యార్థి తయారు చేసిన ఆటోమేటిక్‌ హెల్మెట్‌కు కూడా ఒకటిగా నిలిచిందన్నారు. రాష్ట్రపతి స్వయంగా వచ్చి విద్యార్థి తయారు చేసిన ఆటోమేటిక్‌ హెల్మెట్‌ పరిశీలించారన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement