Khali
-
‘సందేశ్‌ఖాలీ’ కేసు.. ఎన్నికల వేళ ‘తృణమూల్’కు షాక్
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో రాజకీయ దుమారం రేపిన సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, భూ కబ్జాల కేసు దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపింది. సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నేతలు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా వారి భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అక్కడి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తాజాగా సందేశ్‌ఖాలీ అకృత్యాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సందేశ్‌ఖాలీ అకృత్యాల కేసు చాలా సంక్లిష్టమైనది. ఇందులో నిష్పాక్షిక విచారణ జరగాలి. ఈ కేసును ఎవరు విచారించినా రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని మా అభిప్రాయం. కేసు దర్యాప్తులో భాగంగా సామాన్యుల, ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు ఎవరినైనా విచారించే అధికారం సీబీఐకి ఉంది. కేసు విచారించి సమగ్ర దర్యాప్తు నివేదిక మాకు అందించాలి’అని హై కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. సందేశ్‌ఖాలీలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నతృణమూల్ నేత షేక్షాజహాన్ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ఇదే కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేయడానికి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై దాడి కేసులో సీబీఐ ఆయను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. ఈడీ అధికారులపై దాడి కేసును సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. కాగా, సందేశ్‌ఖాలీ ఆందోళనలకు నేతృత్వం వహించిన రేఖాపత్రా అనే మహిళకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది. సందేశ్‌ఖాలీ అంశం ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ ఓట్ల శాతానికి భారీగా గండి కొట్టి బీజేపీకి మేలు చేసే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. ప్రచారంలో యువతికి ముద్దు -
'ది గ్రేట్ ఖలీ' ఏందయ్యా ఇదీ.. టోల్గేట్ సిబ్బందితోనా..!
చండీగఢ్: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ప్రముఖ భారత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ(49) అలియాస్ దలీప్ సింగ్ రాణా మరోమారు వార్తల్లో నిలిచారు. పంజాబ్, లుధియానాలోని ఓ టోల్గేట్ వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టోల్ కార్మికుడిపై ఖలీ చేయి చేసుకున్నాడని అక్కడి సిబ్బంది ఆరోపించారు. టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఖలీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే.. ఆ వీడియోలో టోల్ సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. మరోవైపు.. లాధోవాల్ టోల్ ప్లాజా సిబ్బంది తనను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు దలిప్ సింగ్ రాణా. ఈ సంఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్ నుంచి హరియాణాలోని కర్నాల్‌కు ఖలీ తన కారులో వెళ్తున్న క్రమంలో టోల్గేట్ వద్ద ఈ సంఘటన ఎదురైనట్లు చెప్పారు. ధ్రువీకరణ పత్రం అడిగిన తమ సిబ్బందిని ఎందుకు కొట్టారని ఖలీని టోల్ సిబ్బంది అడుగుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టమవుతోంది. 'మిమ్మల్ని ఐడీకార్డు చూపించాలని అడిగారు. ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది అడగగా.. మీరు నన్ను బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు ఖలీ. దానికి 'మిమ్మల్ని మేము బ్లాక్మెయిల్ చేయటం లేదు.. అతడిని ఎందుకు కొట్టారు? మీ దగ్గర ఉంటే ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది సమాధానమిచ్చారు. అయితే.. తన వద్ద ఎలాంటి ఐడీ కార్డు లేదని ఖలీ వారితో చెప్పారు. WWE wrestler #GreatKhali clashes with toll plaza staff at #Ludhiana#TheGreatKhali #ViralVideo #Punjab #Khali #ludhiana #WWE pic.twitter.com/XYJEhsdVtL — Vineet Sharma (@Vineetsharma906) July 12, 2022 ది గ్రేట్ ఖలీ వాహనం టోల్గేట్ దాటి వెళ్లకుండా ముందు బారికేడ్ పెట్టారు అక్కడి సిబ్బంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఖలీ దానిని తీసి పక్కన పడేశారు. టోల్ సిబ్బంది ఖలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు కలుగజేసుకుని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇరువురు తమ వాదనలు పోలీసులకు వినిపించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన క్రమంలో వివరణ ఇచ్చారు ఖలీ. 'నిన్న పంజాబ్‌లోని లాధోవాల్ టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది నా కారును అడ్డుకుని సెల్ఫీ కోసం నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేను అందుకు అంగీకరించకపోవటం వల్ల జాతివిద్వేష వ్యాఖ్యలు చేశారు. అలాగే కొన్ని బూతులు మాట్లాడారు.' అని ఖలీ చెప్పారు. ఇదీ చూడండి: దిల్లీ- ముంబైల మధ్య 'ఎలక్ట్రిక్ హైవే'.. దేశంలోనే తొలిసారి! -
ఫైటర్ పైలెట్
పాకిస్తాన్ జైలులో ఖైదీగా ఉన్న ఓ భారతీయ బాక్సర్ ఎలా బయటపడ్డాడు? అతనికి ఎవరు సహాయం చేశారు? అసలు.. అతను ఖైదు కావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అన్న అంశాల నేపథ్యంలో జయంత్ సి. పరాన్జి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నరేంద్ర’. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇందులో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ఫీమేల్ ఫైటర్ పైలెట్‌గా నటిస్తున్నారు. ‘‘పాకిస్తాన్ జైలులో ఖైదీ అయిన భారతీయ మాజీ బాక్సర్‌గా నీలేష్ నటిస్తున్నారు. స్వేచ్ఛా పోరాటానికి మద్దతు ఇచ్చే మానవ హక్కుల కార్యకర్తగా బ్రెజిలియన్ బ్యూటీ ఇసాబెల్లా లియేటి కనిపిస్తారు. భారత ఖైదీలను రక్షించే ప్రయత్నంలో తనను తాను త్యాగం చేసుకునే ఆప్షన్ ఖైదీ పాత్రను డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ ద గ్రేట్ ఖలి చేశారు. ఈ సినిమాలోని ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. రామ్ సంపత్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. -
ది గ్రేట్ ఖలీ ప్రచారంలో ఎలా పాల్గొంటాడు?
కోల్‌కతా : బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రెజ్లర్ ది గ్రేట్ ఖలీపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. జాదవ్‌పూర్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి అనుపమ్ హజ్రాకు మద్దతుగా ఖలీ ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అమెరికా పౌరసత్వం కలిగిన ఖలీ ఎన్నికల్లో ఎలా పాల్గొంటారంటూ తృణమూల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆదివారం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. విదేశీ పౌరసత్వం ఉన్నవాళ్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని పేర్కొంది. ఓ విదేశీయుడు భారత ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఇవ్వడం నిబంధనలకు విరుద్దమని... ఖలీ సెలెబ్రిటీ హోదాను బీజేపీ వాడుకుంటూ.... భారతీయ ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అయితే కన్నయ్య కుమార్‌కు మద్దతుగా బంగ్లాదేశీ నటుడు పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తృణమూల్ ఫిర్యాదుపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖలీ పంజాబ్ పోలీసు శాఖలో పని చేసిన విషయాన్ని గుర్తు చేసింది. కాగా 2019 ఎన్నికల్లో అధికారం కోసం తృణమూల్, బీజేపీలో హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. అందులో ఇప్పటికే మూడు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో నెలకొన్న హింసపై ఇరు పార్టీలు పరస్పరం వేలెత్తి చూపుకుంటున్నాయి. -
టాలీవుడ్‌కి రెజ్లింగ్ స్టార్
ఇండియన్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) రెజ్లర్ ‘ది గ్రేట్ ఖలీ’ తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నరేంద్ర’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నారు ఈ ఏడడుగుల రెజ్లర్. ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్లో, అమెరికన్ టీవీ షోల్లో నటించిన ఖలీ ‘బిగ్‌బాస్ 4’లో కూడా కనిపించి అభిమానులను అలరించారు. స్పోర్ట్స్ డ్రామాగా జయంత్ తెరకెక్కిస్తున్న తాజా సినిమాలో నీలేష్ ఎటి, ఇజబెల్లా జంటగా నటిస్తున్నారు. ఇండియా, పాకిస్థాన్ నేపథ్యంలో సినిమా రూపొందుతుండటంతో ఇస్లామిక్ దేశంలో చిత్రీకరణ జరిపేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘నరేంద్ర’ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా, ఈ సినిమాతో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ సంపత్ టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి నిర్మాత: ఇషాన్ ఎంటర్టైన్మెంట్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయలగుండ్ల, కెమెరా: విరీన్ తంబిదొరై, సంగీతం: రామ్ సంపత్, కథ–దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ. -
ఖలీతో కోహ్లి.. కామెంట్లే.. కామెంట్లు..
కొలంబో: భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి డబ్ల్యూడబ్ల్యూఈ భారత రెజ్లింగ్ స్టార్ ఖలీని కలిసాడు. వీరిద్దరూ పక్కపక్కకు నిలబడి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరి ఫోటోపై నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. శ్రీలంకతో రెండో టెస్టు విజయానంతరం కోహ్లి సరదాగా ఈ పంజాబ్ రెజ్లర్‌ను కలిసాడు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోను కోహ్లి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. క్యాప్షన్‌గా ఖళీ వంటి గొప్పవ్యక్తిని కలవడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. ఇక డబ్ల్యూడబ్ల్యూలో ఖలీకి ఎంత ఆదరణ ఉందో అందరికి తెలిసిన విషయమే.. ఈ ఫోటోలో పొడగ్గా పటిష్టమైన ఆకారంతో ఉండే ఖలీ పక్కన కోహ్లి చిన్న పిల్లాడిలా ఉన్నాడు. దీంతో నెటిజన్లు జోక్స్ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. కోహ్లి ఖలీ ముందు నీవు చిన్నపిల్లాడిలా ఉన్నావని ఒకరు.. నీకు ఇలాంటి పొడువైన బౌలర్ కావాలి కదా అని మరోకరు.. నీ నుంచి ఖలీ బ్యాటింగ్ నేర్చుకున్నాడని మరోకరు ట్వీట్ చేశారు. It was Great to meet The Great Khali, what a guy! -
కక్షతో ఖలీ పూజలు
ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ కోలుకున్నాడు. ఆదివారం జరుగనున్న మ్యాచ్‌లో తనపై తీవ్రంగా దాడి చేసిన ప్రత్యర్థులపై రివేంజ్ తీర్చుకోవడానికి అతను సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా శనివారం డెహ్రాడూన్‌లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించాడు. ఈ పూజలో ఖలీతోపాటు అతని అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ బల్దానీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఖలీ తీవ్రంగా గాయపడ్డాడు. ఫైట్ సందర్భంగా రింగ్ బయట ఉన్న మరో ఇద్దరు విదేశీ రెజ్లర్లు కూడా వచ్చి ఖలీని కుర్చీతో ఇష్టమొచ్చినట్టు కొట్టారు. మొత్తం ముగ్గురు కెనడాకు చెందిన రెజ్లర్లు ఖలీని కుర్చీతో కొట్టడమే కాక బలంగా పంచ్లివ్వడంతో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందిన ఖలీ శనివారం కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. ‘ది గ్రేట్ ఖలీ షో’లో భాగంగా ఆదివారం జరుగనున్న ఫైట్ కోసం సిద్ధమవుతున్నాడు. తనపై దాడి చేసిన ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటానని తన తదుపరి ఫైట్‌లో దెబ్బకు దెబ్బ కొట్టి తన సత్తా చాటుతానని ఖలీ ఇప్పటికే ప్రకటించాడు. 7.1 అడుగుల ఎత్తుతో చూడడానికే రెజ్లర్లకు దడ పుట్టించేలా ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీసు ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ సాధించాడు. భారత్ పేరును రెజ్లింగ్ ద్వారా ఖండాతరాలు దాటేలా చేశారు.