డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తొలి అంతర్జాతీయ షార్ట్ ఫిలింను రిలీజ్ చేశాడు. తన గురువు రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో తొలి పోస్టర్ రిలీజ్ చేసిన పూరి, షార్ట్ ఫిలిం కూడా అదే రేంజ్ లో రూపొందించాడు. పెద్దగా కంటెంట్ ఏమీ లేకుండానే.. కేవలం వాయిస్ ఓవర్ తో మూడున్నర నిమిషాల షార్ట్ ఫిలింను నడిపించాడు. చెట్ల వల్ల కలిగే లాభాలు.. వాటిని మనం ఎందుకు కాపాడుకోవాలి అనే విషయాలను ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశాడు. చివర్లో.. పోస్టర్ లో రిలీజ్ చేసిన న్యూడ్ స్టిల్ తో తన మార్క్ చూపించాడు పూరి. క్వాలిటీ పరంగా మాత్రం హగ్ ఆకట్టుకుంటుంది. ఇసాబెల్లా అందాలు, సందీప్ చౌత నేపథ్యం సంగీతం.. పూరి టేకింగ్ ఇలా అన్నీ కలిసి హగ్ షార్ట్ ఫిలింకు అంతర్జాతీయ స్థాయి తీసుకువచ్చాయి.
My 1st international short film
— PURI JAGAN (@purijagan) 31 December 2017
#HUG
They don’t need us ,
We need them ...
here’s the link 👇🏻https://t.co/rf6S6Ni0UU#PCfilm@PuriConnects @Charmmeofficial @Sandeep_Chowta @junaid_editor @anilpaduri
Comments
Please login to add a commentAdd a comment