అనుపమా పరమేశ్వరన్
‘‘నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది ‘శతమానం భవతి’ చిత్రంలోనే. మిగిలిన చిత్రాల్లో సగం క్యారెక్టర్, ఇద్దరు ముగ్గురు నాయికల్లో ఓ నాయికగా నటించాను. ‘తేజ్ ఐ లవ్ యు’లో నేను ఇంతకు ముందెన్నడూ చేయని పాత్ర చేశా’’ అని అనుపమా పరమేశ్వరన్ అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో కె.యస్. రామారావు నిర్మించిన ‘తేజ్ ఐ లవ్ యు’ ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు నందిని.
రియల్ లైఫ్‌లో నేను మాటకారిని. నందిని పాత్ర కూడా మాటకారే. యుఎస్ నుంచి ఓ పర్పస్ కోసం హైదరాబాద్ వచ్చే పాత్ర. చాలా వేరియేషన్స్ ఉంటాయి. పాత్రను బట్టే నేను సినిమా ఎంచుకుంటా. కరుణాకరన్‌గారు హీరోయిన్లను చూపించే విధానం, ఆయన రూపుదిద్దే పాత్రలు చాలా ఇష్టం. సాంగ్స్ తీసేటప్పుడు తేజ్ ఫస్ట్ టేక్‌లోనే స్టెప్పులు చేసేసేవారు. నేను మాత్రం రిహార్సల్స్ చేసి చేసేదాన్ని. నేను తెలుగు నేర్చుకోవడానికి కారణం త్రివిక్రమ్‌గారు. ‘అఆ’ షూటింగ్‌లో నాకు ట్రాన్స్‌లేట్ చేసేవారు.
రెండో సినిమాకు తెలుగు నేర్చుకోవాలని అప్పుడే అనిపించింది. ప్రస్తుతం కన్నడ సినిమా చేస్తున్నా. అందుకే కన్నడ నేర్చుకుంటున్నా. ‘రంగస్థలం’ సినిమా చూడగానే సుకుమార్‌గారికి ఫోన్ చేసి మాట్లాడాను. ఆ పాత్రకి సమంత 101 పర్సెంట్ యాప్ట్ అనిపించింది. మన కోసం రాసిపెట్టిన పాత్రలే మనకు వస్తాయి. ఇంకా బోల్డ్ పాత్రలు, చాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నా. మలయాళంలో మంచి సినిమా అవకాశాలు వచ్చినప్పుడు నేను తెలుగులో చాలా బిజీగా ఉండటంతో చేయలేదు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment