
సాయిధరమ్ తేజ్
ఫేమస్ పాటల పల్లవితో మూవీ టైటిల్‌ను ఎంపిక చేసుకున్న కుర్రహీరోల జాబితాలో తాజాగా సాయిధరమ్ తేజ్ కూడా చేరబోతున్నారని టాక్. సాయిధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనుపమా పరమేశ్వరన్ కథానాయిక.
ఈ చిత్రానికి ‘దేవుడు వరమందిస్తే...’ అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నారని సమాచారం. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘6టీన్స్’ చిత్రంలోని ‘దేవుడు వరమందిస్తే.. నే నిన్నే కోరుకుంటాలే’ పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఆల్రెడీ హీరో రామ్ చిత్రానికి ‘హలో గురు ప్రేమకోసమే..’ అని, శర్వానంద్ చిత్రానికి ‘పడి పడి లేచె మనసు’ అనే టైటిల్స్‌ను ఖరారు చేశారు.