Anupama Parameswaran Starrer Butterfly Movie Teaser Out, Video Viral - Sakshi
Sakshi News home page

Butterfly Movie: థ్రిల్లర్ మూవీగా అనుపమ పరమేశ్వరన్​ 'బటర్​ఫ్లై'.. టీజర్​ విడుదల

Published Fri, Mar 4 2022 3:06 PM | Last Updated on Fri, Mar 4 2022 4:30 PM

Anupama Parameswaran Starrer Butterfly Movie Teaser Out - Sakshi

Anupama Parameswaran Starrer Butterfly Movie Teaser Out: ప్రేమమ్‌’ మూవీతో టాలీవుడ్​ సినీ పరిశ్రమకు పరిచయమైంది మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. చేసింది కొన్ని సినిమాలే అయినా అనతి కాలంలోనే మంచి ఫ్యాన్​ ఫాలోయింగ్​ సంపాదించుకుంది. సినిమాల్లో డిసెంట్‌ రోల్స్‌ ఎంచుకుంటూ అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న ఈ కేరళ కుట్టి రౌడీ బాయ్స్​ మూవీతో కొంత నెగెటివిటీని మూటగట్టుకుంది. అయినా ఫ్యాన్స్​లో ఉన్న తనపై ఉన్న క్రేజ్​ మాత్రం తగ్గలేదు. అయితే తాజాగా అనుపమ పరమేశ్వరన్​ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బటర్​ఫ్లై. 



ఈ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని గంటా సతీష్​ బాబు తెరకెక్కిస్తున్నారు. రవి ప్రకాష్​, ప్రసాద్​ తిరువళ్లూరి, ప్రదీప్​ నల్లిమెల్లి నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్​ను గురువారం సోషల్ మీడియా వేదికగా రిలీజ్​ చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్​లో అనుపమ సంతోషంగా సాగుతున్న జీవితంలో ఒక్కసారిగా అనూహ్యా మార్పులు చోటుచేసుకోవడం చూపించారు. యువతరంతోపాటు కుటంబ ప్రేక్షకుల్ని మెప్పించే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని మేకర్స్​ తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ మూవీకి ఛాయగ్రహనం సమీర్ రెడ్డి కాగా, అరవింద్​ షారోన్​, గిడోన్​ కట్టా సంగీతమందిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement