O2 Teaser: ఇంకో 12 గంటల వరకు బతికి ఉండవచ్చు.. | Nayanatara O2 Movie Teaser Released Will Stream On Disney Plus Hotstar | Sakshi
Sakshi News home page

Nayanatara O2 Movie: థ్రిల్లింగ్‌గా నయనతార 'ఓ2'.. టీజర్ విడుదల

Published Tue, May 17 2022 7:54 PM | Last Updated on Tue, May 17 2022 8:01 PM

Nayanatara O2 Movie Teaser Released Will Stream On Disney Plus Hotstar - Sakshi

Nayanatara O2 Movie Teaser Released Will Stream On Disney Plus Hotstar: స్టార్‌ హీరోయిన్‌ నయన తార గ్యాప్‌ లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తోంది. అనామిక, కర్తవ్యం వంటి హీరోయిన్‌ సింట్రిక్‌ పాత్రల్లో మెప్పించిన నయన్‌ ఇటీవల 'కణ్మనీ రాంబో ఖతీజా' మూవీతో ప్రేక్షకులను నవ్వించింది. తాజాగా 'ఓ2' (O2) సినిమాతో ఆడియెన్స్‌ను థ్రిల్‌కు గురి చేయనుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను మంగళవారం (మే 17) విడుదల చేశారు. నయనతార, ఇతర ప్రయాణికులు కలిసి కొచ్చిన్‌కు వెళ్తున్న బస్సు లోయలో పడిపోతుంది. అందులో ఉన్న ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏం చేశారనేదే సినిమా కథగా తెలుస్తోంది. 

అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఇంకా రిలీజ్‌ డేట్‌ ప్రకటించని ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించగా, జీఎస్‌ వెంకటేశ్‌ దర్శకత్వం వహించారు. కాగా నయనతార ప్రస్తుతం చిరంజీవి 'గాడ్‌ ఫాదర్‌', 'గోల్డ్' తదితర చిత్రాల్లో నటిస్తోంది. 

చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్‌ సంచలన వ్యాఖ్యలు



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement