Anupama Parameswaran: బిజీ బిజీ | Anupama Parameswaran roped in for a women-centric film | Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: బిజీ బిజీ

Published Fri, Jun 9 2023 3:44 AM | Last Updated on Fri, Jun 9 2023 3:44 AM

Anupama Parameswaran roped in for a women-centric film - Sakshi

అనుపమా పరమేశ్వరన్‌

తెలుగులో ప్రస్తుతం రవితేజ ‘ఈగిల్‌’, సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు స్వైర్‌’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు అనుపమా పరమేశ్వరన్‌. ఈ బ్యూటీ తాజాగా మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ‘సినిమా బండి’ ఫేమ్‌ దర్శకుడు ప్రవీణ్‌ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రవీణ్‌ వెల్లడించి, ఓ ఫోటోను షేర్‌ చేశారు.

విజయ్‌ డొంకాడ ఈ సినిమాను నిర్మిస్తారు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇది లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ అని, ట్రావెల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందని భోగట్టా. అలాగే తమిళంలో ‘సైరన్‌’, మలయాళంలో ‘జేఎస్‌కే: ట్రూత్‌ షల్‌ ఆల్వేస్‌ ప్రివైల్‌’ సినిమాలు చేస్తున్నారు అనుపమ. ఇలా వరుస చిత్రాలతో ఈ ఏడాది అనుపమ బిజీ బిజీ అన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement