
ఒక 20 సినిమాలు చేసిన హీరో.. అందులోనూ స్టార్ హీరో కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం అంటే అది కచ్చితంగా హాట్ టాపిక్కే. గురువారం అల్లు అర్జున్ ఇలాంటి టాపిక్ ద్వారానే చర్చల్లో నిలిచారు. ఓ కొత్త దర్శకుడితో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వార్తల్లో ఉన్న ప్రకారం అతని పేరు సంతోష్ రెడ్డి. బన్నీకి సంతోష్ చెప్పిన కథ నచ్చడంతో సింగిల్ సిట్టింగ్‌లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించనున్నారట. సో.. స్టోరీ నచ్చితే బన్నీకి ఏ దర్శకుడైనా ఓకే అన్నమాట. ఈ ఏడాది బన్నీ ఇద్దరు కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చినట్లు. ఒకరు రచయిత వక్కంతం వంశీ. బన్నీ హీరోగా సెట్స్ మీద ఉన్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ద్వారా ఆయన దర్శకునిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. అయితే.. కిక్, రేసుగుర్రం, టెంపర్ వంటి హిట్ చిత్రాలకు కథ అందించిన రచయితగా వక్కంతం వంశీ ఆల్రెడీ పాపులర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Comments
Please login to add a commentAdd a comment