అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబోలో నాలుగో సినిమా! | Allu Arjun and Trivikram Srinivas plan to reunite for the 4th time | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబోలో నాలుగో సినిమా!

Published Sat, May 27 2023 3:44 AM | Last Updated on Sat, May 27 2023 8:32 AM

Allu Arjun and Trivikram Srinivas plan to reunite for the 4th time - Sakshi

హీరో అల్లు అర్జున్ , దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో వచ్చిన  ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. వీరి కాంబినేషన్ లో మరో సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల త్రివిక్రమ్‌ చెప్పిన ఓ స్టోరీ లైన్  అల్లు అర్జున్ కు బాగా నచ్చిందట.

దీంతో త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు అల్లు అర్జున్  గ్రీన్  సిగ్నల్‌ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ నిర్మించనుందట. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్‌’తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ . ఇటు మహేశ్‌బాబు సినిమాతో త్రివిక్రమ్‌ బిజీ. సో... వీరి కమిట్‌మెంట్స్‌ పూర్తయ్యాక అల్లు అర్జున్ , త్రివిక్రమ్‌ సినిమా సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంటుందేమో?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement