సంచలనం రేపుతున్న అనుష్క ‘నిశ్శబ్దం’ | Anushka Nishabdham Teaser And Sai Tej Movie Motion Poster | Sakshi
Sakshi News home page

సంచలనం రేపుతున్న అనుష్క ‘నిశ్శబ్దం’

Published Sun, Oct 27 2019 11:52 AM | Last Updated on Sun, Oct 27 2019 4:48 PM

Anushka Nishabdham Teaser And Sai Tej Movie Motion Poster - Sakshi

అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్ధం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. కోన వెంకట్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అనుష్క, మాధవన్‌ లుక్స్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాకుండా భాగమతి చిత్రం తర్వాత అనుష్క నటిస్తుండటం.. విలక్షణ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన మాధవన్‌ కూడా ఉండటంతో ఈ చిత్రంపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. తాజాగా దీపావళి కానుకగా చిత్రానికి సంబంధించిన ప్రి టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ప్రి టీజర్‌ను పరీక్షిస్తే డిఫరెంట్‌ కాన్సెఫ్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 

మాధవన్‌ వయోలిన్‌ ప్లే చేయడం టీజర్‌లో చూపించారు. ఇక అనుష్క చేతి వేళ్లు ఓ ముద్రను ప్రతిబింబిచేలా ఉన్నాయి. ఆ ముద్ర దేనికి సంకేతమో తెలియాలంటే పూర్తి టీజర్‌ లేదా సినిమాను చూడాల్సిందే. ఇక అనుష్క బర్త్‌ డే(నవంబర్‌ 7) కానుకగా పూర్తి టీజర్‌ను విడుదల చేయనున్నారు. తెలుగులో ‘నిశ్శబ్దం’, మిగతా భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. తెలుగు, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ‘కిల్ బిల్’ మూవీలో విలన్‌గా నటించిన మైఖేల్ మ్యాడిసన్, అవ‌స‌రాల శ్రీనివాస్, సుబ్బ‌రాజులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. 

ఫ్యామిలీస్‌ను టచ్‌ చేసిన ప్రతిరోజు పండగే
చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న హీరో సాయి ధరమ్‌ తేజ్.. మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజు పండగే’ వంటి కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఎస్‌కేఎన్‌ సహ–నిర్మాత. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పస్ట్‌ లుక్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మోషన్‌ పోస్టర్‌ కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా కనెక్ట్‌ చేసింది. సాయి తేజ్‌కు తాతయ్య పాత్రలో ప్రముఖ నటుడు సత్యరాజ్‌ నటిస్తున్నారు. రావు రమేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమన్‌ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ చిత్రం డిసెంబర్‌ 20న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement