
అవును... కథ కుదిరితే, అంతా కుదిరితే తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు రావడం కొత్తేమీ కాదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల’, ‘ఊపిరి’ లాంటి సినిమాలు వచ్చాయి. త్వరలో నాగార్జున, నాని కలసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారు. ఈ లిస్ట్‌లో మహేశ్‌బాబు–సాయిధరమ్ తేజ్ చేరనున్నారని సమాచారం. ‘సీతమ్మ వాకిట్లో...’తో ఈ తరంలో మల్టీస్టారర్ మూవీస్‌కి నాంది పలికిన వెంకీ–మహేశ్ కథ కుదిరితే ఎవరి కాంబినేషన్‌లో చేయడానికైనా రెడీ అని పలు సందర్భాల్లో చెప్పారు. ఆల్రెడీ వెంకీ ఓ మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పైన వార్త చదివితే తెలుస్తుంది.
రెండు రోజుల క్రితం నిర్మాత ‘దిల్’ రాజు మనవడు ఆరాన్ష్ బర్త్‌డే ఫంక్షన్‌కు కొందరు స్టార్స్ హాజరైన విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్లో సాయిధరమ్ తేజ్‌తో మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఓకేనా? అని మహేశ్‌బాబును వంశీపైడిపల్లి అడగ్గా... ‘‘కథ కుదరాలంతే. నేను రెడీనే’’ అన్నారట. ఇటు సాయిధరమ్ కూడా రెడీ అట. ఆల్రెడీ నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి ‘ఊపిరి’ వంటి మల్టీస్టారర్ హిట్ సినిమా తీశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ ఓ సినిమా చేయన్నారు. అంటే... అది మల్టీస్టారరా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment