చిత్రా.. లహరి.. | chitralahari movie shootings in hyderabad | Sakshi
Sakshi News home page

చిత్రా.. లహరి..

Published Wed, Dec 12 2018 2:33 AM | Last Updated on Wed, Dec 12 2018 2:33 AM

chitralahari movie shootings in hyderabad - Sakshi

నివేధా పేతురాజ్, సాయిధరమ్‌ తేజ్, కల్యాణి, కిశోర్‌ తిరుమల

ఈ రోజు గురువారం సాయంత్రం కచ్చితంగా ‘చిత్రలహరి’ చూడాలి. ఇలా ప్రతి గురువారం కోసం ఎదురుచూసే రోజులవి. 1990వ దశకంలో ప్రతి గురువారం దూరదర్శన్‌లో వచ్చే ఆ ఆరు పాటల కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎదురు చూసేవారు. ఇప్పుడు అదే పేరు ‘చిత్రలహరి’తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సాయిధరమ్‌ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేధా పేతురాజ్‌ నాయకా నాయికలుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీస్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

చక్కటి ఫ్యామిలీ కథలను అందించే దర్శకుడు కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. నవంబర్‌లోనే ప్రారంభమైన ఈ చిత్రం దాదాపు 50 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్న ఇద్దరి పేర్లు ‘చిత్రా’, ‘లహరి’ అని సమాచారం. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ నెలలో సినిమాను విడుదల చేయనున్నారట చిత్రబృందం. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్‌ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement