అప్పుడు విలన్, ఇప్పుడు ఫాదర్ | Jagapathi Babu will play Saidharam tej father role | Sakshi
Sakshi News home page

అప్పుడు విలన్, ఇప్పుడు ఫాదర్

Jun 15 2016 10:29 AM | Updated on Aug 16 2018 4:30 PM

అప్పుడు విలన్, ఇప్పుడు ఫాదర్ - Sakshi

అప్పుడు విలన్, ఇప్పుడు ఫాదర్

లెజెండ్ సినిమాతో విలన్గా టర్న్ తీసుకున్న జగపతిబాబు, ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలలో యమా బిజీ ఆర్టిస్ట్గా మారిపోయాడు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో విలన్, తండ్రి పాత్రలు చేస్తున్న...

లెజెండ్ సినిమాతో విలన్గా టర్న్ తీసుకున్న జగపతిబాబు, ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలలో యమా బిజీ ఆర్టిస్ట్గా మారిపోయాడు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో విలన్, తండ్రి పాత్రలు చేస్తున్న ఈ మాజీ హీరో.., తమిళ, మలయాళ సినిమాల  మీద కూడా దృష్టి పెట్టాడు. ఇప్పటికే లింగా సినిమాలో సూపర్ స్టార్కు విలన్గా నటించిన జగ్గుబాయ్, ఇప్పుడు విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ నటిస్తున్నాడు.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న పులిమురుగన్ సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇతర భాషల్లో బిజీ అవుతున్నా తెలుగు సినిమాలను మాత్రం బాగానే మ్యానేజ్ చేస్తున్నాడు. పిల్లానువ్వులేని జీవితం సినిమాలో సాయిధరమ్ తేజ్కు విలన్గా నటించిన జగపతిబాబు, నెక్ట్స్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సాయికి తండ్రిగా నటించడానికి అంగకీరించాడు జగపతిబాబు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement