హలో గురు | Sai Dharam Tej To Romance Ritika Singh | Sakshi
Sakshi News home page

హలో గురు

Published Sat, May 26 2018 5:17 AM | Last Updated on Sat, May 26 2018 5:17 AM

Sai Dharam Tej To Romance Ritika Singh  - Sakshi

రితికా సింగ్‌, సాయిధరమ్‌ తేజ్‌

వెంకటేశ్‌ హీరోగా వచ్చిన ‘గురు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు రితికా సింగ్‌. రియల్‌ లైఫ్‌లో బాక్సర్‌ అయిన ఈ ముంబై బ్యూటీ రీల్‌ లైఫ్‌లోనూ బాక్సర్‌గా అలరించారు. లారెన్స్‌ హీరోగా వచ్చిన ‘శివలింగా’ చిత్రంతో తమిళ ప్రేక్షకులనూ ఆకట్టుకున్న రితికా తాజాగా ఓ తమిళ చిత్రంతో పాటు తెలుగు సినిమా చేస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగా హరినా«ద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నీవెవరో’ చిత్రంలో రితికా ఓ కథానాయిక. తాజాగా ఆమె సాయిధరమ్‌ తేజ్‌ సరసన నటించే క్రేజీ ఆఫర్‌ సొంతం చేసుకున్నారని అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు చోటుండగా ‘హలో’ ఫేమ్‌ కల్యాణీ ప్రియదర్శన్‌ని ఓ హీరోయిన్‌గా ఎంచుకున్నారు. రెండో కథానాయికగా అనుపమా పరమేశ్వరన్‌ తీసుకున్నారనే వార్తలొచ్చాయి. తాజాగా ఆ అవకాశం రితికా సింగ్‌కి దక్కినట్లు భోగట్టా. ఆ పాత్రకు రితికా అయితే సరిగ్గా సరిపోతారన్నది చిత్రబృందం ఆలోచనట మరి.. ఈ ముంబై బ్యూటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారా? వెయిట్‌
అండ్‌ సీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement