రిస్క్ చేస్తున్న కళ్యాణ్రామ్ | kalyanram Sher releaseing on october 9th | Sakshi
Sakshi News home page

రిస్క్ చేస్తున్న కళ్యాణ్రామ్

Published Sun, Sep 13 2015 12:45 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

రిస్క్ చేస్తున్న కళ్యాణ్రామ్

రిస్క్ చేస్తున్న కళ్యాణ్రామ్

పటాస్ సినిమాతో చాలా కాలం తరువాత సక్సెస్ చూసిన కళ్యాణ్రామ్, తన నెక్ట్స్ సినిమా విషయంలో భారీ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. పటాస్తో పాటు షూటింగ్ జరుపుకున్న షేర్ సినిమాను దసరా బరిలో దించడానికి రెడీ అవుతున్నాడు. ఇంత వరకు ప్రమోషన్ కూడా స్టార్ చేయని ఈ సినిమాను ఇంత షార్ట్ గ్యాప్లో రిలీజ్ చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇప్పటికే దసరా బరిలో మెగా హీరోలు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాను సెప్టెంబర్ 24న రిలీజ్ చేస్తున్నారు. ఆడియో రిలీజ్ కూడా అయిన ఈ సినిమా విజయంపై  చిత్రయూనిట్  చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఈ సినిమా తరువాత వారం గ్యాప్లోనే మరో మెగా హీరో వరుణ్ కూడా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కిన 'కంచె' సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు వరుణ్.

సుబ్రమణ్యం ఫర్ సేల్, కంచె సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుండగానే తన షేర్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. రుద్రమదేవి పోస్ట్ పోన్ కావటంతో ఖాళీ అయిన అక్టోబర్ 9న షేర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ప్రమోషన్ కూడా స్టార్ చేయని ఈ సినిమాను ఇంత భారీ కాంపిటిషన్ మధ్య రిలీజ్ చేయటం రిస్క్ అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement