Sher
-
సైన్స్‌కు ఆధారం ఆధ్యాత్మికతేనా?
శేర్ (సిరాజ్) నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హర ఓం హర’. అశోక్ కుల్హర్, దేవేంద్ర మదన్ సింగ్ నేగి నిర్మిస్తు్తన్న ఈ చిత్రంలో గంగాధర్, కర్ణిక ఇతర ముఖ్య తారాగాణం. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ తూర్పు గోదావరి జిల్లాలో ముగి సింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘ఆధ్యాత్మికత అంతా సైన్స్‌తోనే ముడిపడి ఉందని, సైన్స్‌కు ప్రధాన వనరు ఆధ్యాత్మికతేనని నిరూపిస్తూ రూపొందిస్తున్న సినిమా ఇది. తెలుగుతో ΄ాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో సుమన్, ఆమని కీలక ΄ాత్రధారులు. -
రజనీ సినిమాలో నాని?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నాని సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. లైకా,ప్రోడక్షన్స్పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించనున్నారని ప్రచారం జరిగింది. తాజాగా హీరో నాని పేరు తెరపైకి వచ్చింది. కథ రీత్యా ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు నానీని చిత్ర యూనిట్ సంప్రదించిందని కోలీవుడ్ టాక్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సో.. ఈ సినిమాకి నానీని అడిగారా? లేదా అనేది త్వరలో తెలిసిపోతుంది. -
'షేర్' మూవీ రివ్యూ
టైటిల్ : షేర్ తారాగణం : కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్, విక్రమ్ జిత్ విర్క్, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, దర్శకుడు : మల్లికార్జున్ నిర్మాత : కొమర వెంకటేష్ సంగీతం : థమన్ 2015 జనవరిలో పటాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండింగ్ లో షేర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సినిమా కథాకథనాల పరంగా ప్రయోగాల జోలికి పోకపోయినా, షేర్ సినిమా విషయంలో భారీ రిస్క్ చేశాడు ఈ నందమూరి హీరో. గతంలో తనే హీరోగా రెండు భారీ డిజాస్టర్ లు అందించిన అదే దర్శకుడితో మరో సినిమా చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. మరి కళ్యాణ్ రామ్ నమ్మకాన్ని దర్శకుడు మల్లిఖార్జున్ ఎంత వరకు నిలబెట్టుకున్నాడు. దశాబ్ద కాలం తరువాత హిట్ ట్రాక్‌లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ షేర్ సినిమాతో ఆ టెంపోను కంటిన్యూ చేశాడా..? రివ్యూలో చూద్దాం. కథ : గౌతమ్ ( కళ్యాణ్ రామ్) మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ సాదా సీదా కుర్రాడు. సివిల్ ఇంజనీర్‌గా పనిచేసే హీరో తన కుటుంబం కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి రెడీగా ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ నందిని (సోనాల్ చౌహాన్) తో ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా తన జీవితంలో ఒకేసారి రెండు మార్పులు చోటు చేసుకుంటాయి. తన జీవితంలో ఊహించని మార్పుల కారణంగా తాను ఎప్పటినుంచో కలగంటున్నవాటిని.. కుటుంబం కోసం వదులుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో హీరో తన ప్రేమను, తన కలను ఎలా సాధించాడు అన్నదే మిగతా కథ. విశ్లేషణ : నటుడిగా కళ్యాణ్ రామ్ తన మార్క్ చూపించాడు. పటాస్ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా ప్రూవ్ చేస్తున్న కళ్యాణ్ రామ్ అదే జోరు చూపించాడు. యాక్టింగ్ తో పాటు డ్యాన్స్‌లు, ఫైట్స్‌తోనూ ఆకట్టుకున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ తెరకెక్కించాలన్న దర్శకుడి ప్రయత్నం సినిమాకు మైనస్ అయ్యిందని చెప్పొచ్చు. కథకు అవసరం లేకపోయినా హీరోయిజం కోసం, కామెడీ కోసం ప్లాన్ చేసిన సీన్స్ ఆకట్టుకోలేకపోయాయి. ఇక హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్ షో తప్ప ఎలాంటి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, విక్రమ్ జిత్ లాంటి విలన్స్ ఉన్నా వారిని సరిగ్గా ఉపయోగించుకున్నట్టుగా కనిపించలేదు. రోటీన్ కామెడీ సీన్స్ సినిమాకు చాలా పెద్ద మైనస్. ప్రమోషన్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే ఓపెనింగ్స్ బాగుండేవి. ప్లస్ పాయింట్స్ : కళ్యాణ్ రామ్ సోనాల్ చౌహాన్ గ్లామర్ కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : సెకండాఫ్ కామెడీ సీన్స్ సినిమా నిడివి ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్స్ ఓవరాల్‌గా కళ్యాణ్ రామ్, మల్లికార్జున్ ల మూడో ప్రయత్నం కూడా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. -
షేర్ వార్
అతనికి నచ్చితే ఎంత రిస్క్ అయినా కేర్ చేయడు. మరి ఇలాంటి పవర్ఫుల్ డైనమైట్ అనుకోని పరిస్ధితుల్లో తన వాళ్ల కోసం వార్ ప్రకటించాడు. తనకు ఎదురొచ్చిన వాళ్ల మీద షేర్లా విరుచుకుపడ్డాడు. మరి అతని పోరాటం ఎందుకో తెలియాలంటే ‘షేర్’ చూడాల్సిందే అంటున్నారు నిర్మాత కొమర వెంకటేశ్. నందమూరి కల్యాణ్‌రామ్, సోనాల్‌చౌహాన్ జంటగా విజయలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై మల్లికార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది. ‘‘కల్యాణ్‌రామ్ ఈ చిత్రంలో కొత్త డైమన్షెన్లో కనిపిస్తారు. ‘పటాస్’ తర్వాత కల్యాణ్‌రామ్ కెరీర్లో మరో సూపర్‌హిట్ చిత్రమిది. మల్లికార్జున్ టేకింగ్, థమన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్స్: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్, సమర్పణ: సాయి నిహారిక. -
నందమూరి షేర్
‘పటాస్’ సినిమాతో మంచి విజయం అందుకున్న కల్యాణ్‌రామ్ ఇప్పుడు ‘షేర్’గా విజృంభించడానికి సిద్ధమవుతున్నారు. మల్లికార్జున్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్, సోనాల్ చౌహాన్ జంటగా కొమర వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదల కానుంది. ‘‘షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పాటలను అక్టోబర్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కల్యాణ్‌రామ్ పాత్రచిత్రణ సరికొత్తగా ఉంటుంది. కమర్షియల్ ఎంటర్టైనర్గా సాగే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని నిర్మాత చెప్పారు. కల్యాణ్‌రామ్ నటన ఈ చిత్రానికి హైలైట్ అని దర్శకుడు చెప్పారు, ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: సర్వేశ్ మురారి, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్. -
రిస్క్ చేస్తున్న కళ్యాణ్‌రామ్
పటాస్ సినిమాతో చాలా కాలం తరువాత సక్సెస్ చూసిన కళ్యాణ్‌రామ్, తన నెక్ట్స్ సినిమా విషయంలో భారీ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. పటాస్‌తో పాటు షూటింగ్ జరుపుకున్న షేర్ సినిమాను దసరా బరిలో దించడానికి రెడీ అవుతున్నాడు. ఇంత వరకు ప్రమోషన్ కూడా స్టార్ చేయని ఈ సినిమాను ఇంత షార్ట్ గ్యాప్‌లో రిలీజ్ చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే దసరా బరిలో మెగా హీరోలు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాను సెప్టెంబర్ 24న రిలీజ్ చేస్తున్నారు. ఆడియో రిలీజ్ కూడా అయిన ఈ సినిమా విజయంపై చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఈ సినిమా తరువాత వారం గ్యాప్‌లోనే మరో మెగా హీరో వరుణ్ కూడా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కిన 'కంచె' సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు వరుణ్. సుబ్రమణ్యం ఫర్ సేల్, కంచె సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుండగానే తన షేర్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. రుద్రమదేవి పోస్ట్ పోన్ కావటంతో ఖాళీ అయిన అక్టోబర్ 9న షేర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ప్రమోషన్ కూడా స్టార్ చేయని ఈ సినిమాను ఇంత భారీ కాంపిటిషన్ మధ్య రిలీజ్ చేయటం రిస్క్ అంటున్నారు ఫ్యాన్స్. -
షేర్...షంషేర్
ఏడు నెలల క్రితం ‘పటాస్’ అంటూ జోష్‌గా తెరపై కనిపించి కల్యాణ్‌రామ్ భారీ హిట్ కొట్టేసారు. ఆ విజయాన్ని కొనసాగించాలనే తపనతో ఓ మంచి కథ ఎంచుకున్నారు. ‘షేర్’ అని టైటిల్ పెట్టారు. ఇక, అభిమానుల్లో అంచనాలు పెరగకుండా ఎలా ఉంటాయి? కల్యాణ్‌రామ్ షంషేర్‌గా ‘షేర్’ పాత్రలో అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. సాయి నిహారిక, శరత్‌చంద్ సమర్పణలో మల్లికార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సొనాల్ చౌహాన్ కథానాయిక. నేడు కల్యాణ్‌రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘షేర్’గా కల్యాణ్‌రామ్ ఎలా ఉంటారో తెలియజేయడానికి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. పండగ వాతావరణాన్ని తెలియజేస్తున్న ఈ లుక్ అభిమానులకు నచ్చుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ ఓ కొత్త కోణంలో కనిపిస్తారని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని, ఆగస్ట్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత తెలిపారు. నందమూరి అభిమానులు పండగ చేసుకునేలా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఉంటుందని, కల్యాణ్‌రామ్ కెరీర్లో సంచలనాత్మక చిత్రం అవుతుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: తమన్ ఎస్.ఎస్, కెమెరా: సర్వేష్ మురారి, లైన్ ప్రొడ్యూసర్స్: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్.