షేర్...షంషేర్ | Nandamuri Kalyan Ram 'Sher' Movie First Look | Sakshi
Sakshi News home page

షేర్...షంషేర్

Published Sat, Jul 4 2015 10:53 PM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

షేర్...షంషేర్

షేర్...షంషేర్

 ఏడు నెలల క్రితం ‘పటాస్’ అంటూ జోష్‌గా తెరపై కనిపించి కల్యాణ్‌రామ్ భారీ హిట్ కొట్టేసారు. ఆ విజయాన్ని కొనసాగించాలనే తపనతో ఓ మంచి కథ ఎంచుకున్నారు. ‘షేర్’ అని టైటిల్ పెట్టారు. ఇక, అభిమానుల్లో అంచనాలు పెరగకుండా ఎలా ఉంటాయి? కల్యాణ్‌రామ్ షంషేర్‌గా ‘షేర్’ పాత్రలో అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. సాయి నిహారిక, శరత్‌చంద్ సమర్పణలో మల్లికార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సొనాల్ చౌహాన్ కథానాయిక. నేడు కల్యాణ్‌రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘షేర్’గా కల్యాణ్‌రామ్ ఎలా ఉంటారో తెలియజేయడానికి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. పండగ వాతావరణాన్ని తెలియజేస్తున్న ఈ లుక్ అభిమానులకు నచ్చుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
 
 ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ ఓ కొత్త కోణంలో కనిపిస్తారని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని, ఆగస్ట్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత తెలిపారు. నందమూరి అభిమానులు పండగ చేసుకునేలా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉంటుందని, కల్యాణ్‌రామ్ కెరీర్‌లో సంచలనాత్మక చిత్రం అవుతుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: తమన్ ఎస్.ఎస్, కెమెరా: సర్వేష్ మురారి, లైన్ ప్రొడ్యూసర్స్: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement