షేర్ వార్ | Kalyan Ram's Sher censored! | Sakshi
Sakshi News home page

షేర్ వార్

Published Tue, Oct 20 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM

షేర్ వార్

షేర్ వార్

అతనికి నచ్చితే ఎంత రిస్క్ అయినా కేర్ చేయడు. మరి ఇలాంటి పవర్‌ఫుల్ డైనమైట్ అనుకోని పరిస్ధితుల్లో తన  వాళ్ల కోసం వార్ ప్రకటించాడు. తనకు ఎదురొచ్చిన వాళ్ల మీద షేర్‌లా విరుచుకుపడ్డాడు. మరి అతని పోరాటం ఎందుకో తెలియాలంటే ‘షేర్’ చూడాల్సిందే అంటున్నారు  నిర్మాత కొమర వెంకటేశ్. నందమూరి కల్యాణ్‌రామ్, సోనాల్‌చౌహాన్ జంటగా విజయలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై మల్లికార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది.

‘‘కల్యాణ్‌రామ్ ఈ చిత్రంలో కొత్త డైమన్షెన్‌లో కనిపిస్తారు. ‘పటాస్’ తర్వాత కల్యాణ్‌రామ్ కెరీర్‌లో మరో సూపర్‌హిట్ చిత్రమిది. మల్లికార్జున్ టేకింగ్, థమన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్స్: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్, సమర్పణ: సాయి నిహారిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement