రజనీ సినిమాలో నాని? | Natural Star Nani to share the screenspace with Superstar Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీ సినిమాలో నాని?

Published Sat, Aug 5 2023 12:58 AM | Last Updated on Sat, Aug 5 2023 7:02 AM

Natural Star Nani to share the screenspace with Superstar Rajinikanth - Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో నాని సిల్వర్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. రజనీకాంత్‌ హీరోగా ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. లైకా,ప్రోడక్షన్స్‌పై సుభాస్కరన్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నారని ప్రచారం జరిగింది. తాజాగా హీరో నాని పేరు తెరపైకి వచ్చింది. కథ రీత్యా ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు నానీని చిత్ర యూనిట్‌ సంప్రదించిందని కోలీవుడ్‌ టాక్‌. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. సో.. ఈ సినిమాకి నానీని అడిగారా? లేదా అనేది త్వరలో తెలిసిపోతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement