నందమూరి షేర్ | nandamuri kalyan ram sher release date october 30 | Sakshi
Sakshi News home page

నందమూరి షేర్

Published Sun, Sep 20 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

నందమూరి షేర్

నందమూరి షేర్

‘పటాస్’ సినిమాతో మంచి విజయం అందుకున్న కల్యాణ్‌రామ్ ఇప్పుడు ‘షేర్’గా విజృంభించడానికి సిద్ధమవుతున్నారు. మల్లికార్జున్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్, సోనాల్ చౌహాన్ జంటగా కొమర వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదల కానుంది. ‘‘షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పాటలను అక్టోబర్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కల్యాణ్‌రామ్ పాత్రచిత్రణ సరికొత్తగా ఉంటుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సాగే  ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని నిర్మాత చెప్పారు. కల్యాణ్‌రామ్ నటన ఈ చిత్రానికి హైలైట్ అని దర్శకుడు చెప్పారు, ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: సర్వేశ్ మురారి, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement