
సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, ప్రభాస్
సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సీకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఫిబ్రవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘లెట్స్ డు’ను హీరో ప్రభాస్ ఆదివారం రిలీజ్ చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘సాంగ్ లాంచ్ చేయాలని వినాయక్‌గారు మొహమాటపడుతూ పిలిచారు. ఆయన ఒక్క మెసేజ్ చేసి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తా. ఆయన ఎప్పుడు పిలిచినా కాదనను.
వినాయక్‌గారితో సినిమా చేయడం లక్కీ అని తేజ్‌కు చెప్పాను. చిరంజీవిగారు చేసిన ‘చమకు.. చమకు..’ నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్. ఈ సాంగ్‌ను తేజ్ ఎలా చేశాడో చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ‘‘ప్రభాస్ అంటే స్నేహానికి నిలువెత్తు రూపం. ప్రభాస్ లాంటి మనిషి ఇండస్ట్రీలో ఉండటం అరుదు. సినిమాలో తేజ్ ఇరగదీశాడు’’ అన్నారు దర్శకుడు వినాయక్. ‘‘ప్రభాస్ అన్నను ఫ్యామిలీ మెంబర్‌లా ఫీలవుతాం. సాంగ్‌ను రిలీజ్ చేసిన ప్రభాస్ అన్నకు థ్యాంక్స్’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment