సాయిధరమ్ తేజ్
‘‘రీమిక్స్ సాంగ్స్ కావాలని నేనెప్పుడూ అడగలేదు. అది డైరెక్టర్స్ ఛాయిస్. ఆ రీమిక్స్‌కి నా బెస్ట్ ఇవ్వటానికి కృషి చేస్తాను. నాలుగు రీమిక్స్ సాంగ్స్‌ను ఎంజాయ్ చేస్తూ, బాధ్యతగా చేశాను’’ అన్నారు సాయిధరమ్ తేజ్. వీవీ వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా సి.కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు.
► ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఎప్పుడూ ట్రై చేయడు. ఫ్రెండ్స్, పేరెంట్స్ వల్ల కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటకు వచ్చే ప్రాసెస్‌లో ఎంత ఇంటిలిజెంట్‌గా బిహేవ్ చేసి, తన వాళ్లను కాపాడుకుంటాడనే పాయింట్‌తో నా క్యారెక్టర్‌ని బిల్డ్ చేశారు.మనకి హెల్ప్ చేసినవాళ్లను ఎప్పుడూ మరచిపోకూడదు. వాళ్లకు అవసరం వచ్చినప్పుడు మనం వాళ్లకు ఉండాలనే మెసేజ్ ఉంది.
► ఫస్ట్ టైమ్ ఫుల్ లñ ంగ్త్ కమర్షియల్ మూవీ చేశా. కొత్తగా అనిపించింది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ప్రతి సినిమా బ్రేక్ ఇస్తుందనే చేస్తాం. అన్ని సినిమాలకూ ఒకేలా కష్టపడతాం.
► వినాయక్‌గారు ఏం చెప్పినా చేసేస్తాం. ఆయన అడిగే విధానం అంత బావుంటుంది. అంత కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు మన దృష్టి మొత్తం మన డైలాగ్స్ మీద, మన షాట్స్ మీద పెట్టుకొని ఇంకా బాగా వర్క్ చేయొచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్‌తో చేస్తే ఇలా ఉంటుందా? అనిపించింది. నాలో మా ఇద్దరి మావయ్యలు కనిపిస్తారని, వినాయక్‌గారు దాన్ని బెస్ట్‌గా యుటిలైజ్ చేసుకొని ఆడియన్స్‌కు ఇవ్వాలనుకున్నారు. ఆకుల శివగారు రాసిన కథకు ఆయన స్టైల్లో స్క్రీన్‌ప్లే రాశారు. నేనెంత ఇంటెలిజెంట్ అంటే ఒక 60 పర్సెంట్ అనుకుంటున్నాను. కానీ నా గురువులందరూ ఇంటెలిజెంట్సే.
► నా లాస్ట్ సినిమాల్లో చేసిన తప్పులు ఎనలైజ్ చేసుకుంటున్నాను. డైరెక్టర్స్ అనుకున్నట్టుగానే తీశారు కానీ ఆడియన్స్ ఆశించింది ఇవ్వలేకపోయాం. అది ఎవ్వరి తప్పు కాదు. సినిమా అంటేనే కలñ క్టివ్ ఎఫర్ట్. ఎవర్నీ బ్లేమ్ చేయడానికి లేదు.
► వరుణ్, నేను ఒకేసారి రావాలనుకోలేదు. అది తెలియకుండా జరిగింది. ఇద్దరం కూర్చుని డిస్కస్ చేశాం. కానీ ప్రొడ్యూసర్స్ ఇష్యూ కదా అని చేతులు ఎత్తేశాం. కానీ నాకనిపించింది ఇద్దరం ఒకేసారి హిట్ కొడితే ఆ కిక్కే వేరని. మా మెగా హీరోస్ ఇంతమంది అయ్యేసరికి ఇలా రిలీజ్ డేట్ ఇష్యూ అవుతోంది అంటే.. మాకు ఇదో టెస్ట్ అనుకుంటాను. ప్రేక్షకులకు రెండు సినిమాలు నచ్చుతాయని ఆశిస్తున్నాను. మా సినిమాలు హిట్ అయ్యాక వరుణ్, నేను కలిసి సక్సెస్ మీట్ పెడతాం.
⇒ మీ స్పెషల్ ఫ్రెండ్ రెజీనా ఈ మధ్య ఓ యంగ్ హీరోతో లవ్‌లో పడి, కెరీర్ పాడు చేసుకున్నా అన్నారు. మీ ఒపీనియన్?
► క్లోజ్ ఫ్రెండే.. కాదనడంలేదు. కానీ తన పర్సనల్ విషయాల గురించి నేను కామెంట్ చేయదలచుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment