‘హిడింబ’ ట్రైలర్‌ అదిరిపోయింది | Sai Dharam Tej Talks About HIDIMBA Trailer Launch | Sakshi
Sakshi News home page

‘హిడింబ’ ట్రైలర్‌ అదిరిపోయింది

Published Sat, May 27 2023 3:56 AM | Last Updated on Sat, May 27 2023 8:30 AM

Sai Dharam Tej Talks About HIDIMBA Trailer Launch - Sakshi

అనిల్, అశ్విన్, సాయిధరమ్, నందిత, గంగపట్నం శ్రీధర్‌

‘‘క్రికెట్‌ వల్ల అశ్విన్ తో నాకు పరిచయం ఏర్పడింది. అశ్విన్  హీరోగా నటించిన ‘హిడింబ’ ట్రైలర్‌ లాంచ్‌కు రావడం సంతోషంగా ఉంది. ట్రైలర్‌ అదిరిపోయింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు సాయిధరమ్‌ తేజ్‌. అశ్విన్ బాబు హీరోగా అనిల్‌ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందు తున్న చిత్రం ‘హిడింబ’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ అనిల్‌ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సాయిధరమ్‌ ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

అశ్విన్ బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ నా కెరీర్‌లో హయ్యెస్ట్‌ బడ్జెట్‌ మూవీ. ఈ సినిమా అందర్నీ ఎంటర్‌టైన్  చేస్తుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేశాను’’ అన్నారు నందితా శ్వేత. ‘‘ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ నుంచి హిస్టారికల్‌ ఫిక్షన్ కు వెళ్లే చిత్రమిది. అశ్విన్  యాక్టింగ్‌ స్కిల్స్‌ ఈ సినిమాతో తెలుస్తాయి’’ అన్నారు అనిల్‌. ‘‘అశ్విన్  సపోర్ట్‌ వల్ల ఈ ప్రాజెక్ట్‌ సాధ్యమైంది. త్వరలో రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: వికాస్‌ బాడిస, కెమెరా: బి. రాజశేఖర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement