కొంత గ్యాప్‌ తీసుకున్న స్టార్స్‌.. ఎందుకో తెలుసా..? | Some gap from the shootings for the stars new makeover | Sakshi
Sakshi News home page

కొంత గ్యాప్‌ తీసుకున్న స్టార్స్‌.. ఎందుకో తెలుసా..?

Published Wed, Jul 19 2023 3:36 AM | Last Updated on Wed, Jul 19 2023 7:13 AM

Some gap from the shootings for the stars new makeover - Sakshi

ప్రతీ క్యారెక్టర్‌ సవాల్‌గా అనిపించక పో వచ్చు. అయితే కొన్ని క్యారెక్టర్స్‌ మాత్రం చాలెంజ్‌ చేస్తాయి. మంచి మేకోవర్‌ని డిమాండ్‌ చేస్తాయి. అలాంటి క్యారెక్టర్స్‌ని చాలెంజ్‌గా తీసుకుని మేకోవర్‌ అయి పో తుంటారు స్టార్స్‌. ఇప్పుడు కొందరు స్టార్స్‌ కొత్త మేకోవర్‌ కోసం షూటింగ్స్‌ నుంచి కొంత గ్యాప్‌ తీసుకుని, స్పెషల్‌గా ట్రైన్‌ కావాలనుకుంటున్నారు. ఆ స్టార్స్‌ గురించి తెలుసుకుందాం. 

ఫారెస్ట్‌లో యాక్షన్‌ 
దాదాపు మూడు నెలల పాటు మహేశ్‌బాబు ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని తెలుస్తోంది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్‌ అడ్వెంచరెస్‌ ఫిల్మ్‌ ఇది. ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాదిప్రారంభంలో స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు దర్శక–రచయిత విజయేంద్రప్రసాద్‌. ఈ చిత్రంలో హీరో మహేశ్‌బాబు సరికొత్త సర్‌ప్రైజింగ్‌ లుక్‌లో కనిపించనున్నారట. ఇందు కోసం మహేశ్‌ మూడు నెలల కఠోర శ్రమతో కూడిన ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారన్నది ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట.

ప్రస్తుతం మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఫిల్మ్‌ ఇది. ఈ సినిమా షూటింగ్‌ మొత్తం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత కొన్నాళ్లు గ్యాప్‌ తీసుకుంటారట మహేశ్‌. ఈ గ్యాప్‌లో రాజమౌళి సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటారని తెలిసింది.

వార్‌ ట్రైనింగ్‌ 
ఏ పాత్రలోనైనా లీనమై పో తారు ఎన్టీఆర్‌. ఇందుకోసం ఆయన ఎంతటి రిస్క్‌ అయినా తీసుకుంటారు. క్లిష్టమైన వర్కౌట్స్‌ చేయడానికి కూడా వెనకాడరు. ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి సినిమాల కోసం ఎన్టీఆర్‌ కష్టపడి ఎలా మేకోవర్‌ అయ్యారో తెలిసిందే. ఎన్టీఆర్‌ మరోసారి మేకోవర్‌ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. హిందీలో యశ్‌రాజ్‌ చోప్రాబ్యానర్‌పై స్పై యూనివర్స్‌లో భాగంగా ఆదిత్యా చోప్రా‘వార్‌ 2’ చిత్రం నిర్మించనున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ మెయిన్‌ లీడ్‌ రోల్స్‌ చేయనున్నారు. ఈ కథ రీత్యా ఎన్టీఆర్‌ పాత్రలో కాస్త నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ‘వార్‌ 2’ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లోప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాలోని తన రోల్, లుక్‌ కోసం ఎన్టీఆర్‌ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని సెప్టెంబరు చివరికల్లా పూర్తి చేసి, ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని ‘వార్‌ 2’ ట్రైనింగ్‌లో బిజీ అయి పో యి, డిసెంబరులో షూటింగ్‌లో జాయిన్‌ అవ్వాలన్నది ఎన్టీఆర్‌ ప్లాన్‌ అట.  

మరో సర్‌ప్రైజ్‌ 
‘పుష్ప’ చిత్రంలో అల్లు అర్జున్‌ మేకోవర్‌ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మరోసారి ఆడియన్స్‌ వావ్‌ అనేలా అల్లు అర్జున్‌ మేకోవర్, లుక్‌ ఉండబోతున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది.

ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ గెటప్‌ కొత్తగా ఉంటుందని, ఈ గెటప్‌ మేకోవర్‌ కోసం అల్లు అర్జున్‌ కొంత టైమ్‌ తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్‌’తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్‌. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ సినిమా కోసం  వర్కౌట్‌ చేస్తారని తెలుస్తోంది.  

ఆరు నెలల విరామం 
దాదాపు ఆరు నెలలు బ్రేక్‌ తీసుకోవాలనుకుంటున్నారు సాయిధరమ్‌ తేజ్‌. ఫిజికల్‌గా ఇంకొంచెం స్ట్రాంగ్‌గా అవ్వాలనుకుంటున్నానని, ఇందుకోసం ఆరు నెలల సమయం పడుతుందనీ సాయిధరమ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

సాయిధరమ్‌ తర్వాతి చిత్రం సంపత్‌ నంది దర్శకత్వంలో ఉంటుంది. భారీ బడ్జెట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. సో.. ఆరు నెలల బ్రేక్‌లో సాయిధరమ్‌ ఫిట్‌నెస్‌ కోసం చేసే వర్కౌట్స్‌ ఈ సినిమాకు కూడా ఉపయోగపడతాయని, తను సరికొత్త మాస్‌ లుక్‌లో కనిపించే అవకాశం ఉందని భోగట్టా. 

ఇలా షూటింగ్స్‌ నుంచి కొంత గ్యాప్‌ తీసుకుని తమ కొత్త సినిమాల గెటప్‌ల కోసం ట్రైనింగ్‌ తీసుకోవడానికి మరికొందరు స్టార్స్‌ కూడా రెడీ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement