బన్నీనే నంబర్ వన్
వరుసగా 50 కోట్ల సినిమాలతో సత్తా చాటుతున్న యంగ్ హీరో అల్లు అర్జున్. ఆన్ లైన్ లోనూ రికార్డ్ లు సృష్టిస్తున్నాడు. 2016లో ఆన్ లైన్ లో అతి ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోగా రికార్డ్ సృష్టించాడు బన్నీ. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో నిలిచాడు బన్నీ. ఆ తరువాత స్ధానాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, బాహుబలి ప్రభాస్ లు నిలవగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఇటీవల సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తరువాత కాస్త గ్యాప్ తీసుకొని డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాను ప్రారంభించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు బన్నీ. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను 2017 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.